కోట మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.. మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు: మోహన్ బాబు

కోట శ్రీనివాసరావు కుటుంబాన్నిప్రముఖ నటుడు మోహన్ బాబు పరామర్శించారు.

కోట మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది.. మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు: మోహన్ బాబు

Manchu Mohan Babu

Updated On : July 21, 2025 / 12:15 PM IST

Mohan Babu: కోట శ్రీనివాసరావు మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు. ఆయన మరణం మా ఫ్యామిలీకే కాకుండా సినిమా పరిశ్రమకు తీరని లోటు అని ప్రముఖ నటులు మంచు మోహన్ బాబు అన్నారు. కోట శ్రీనివాసరావు కుటుంబాన్ని సోమవారం ఉదయం మోహన్ బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కోటతో అనుబంధాన్ని పంచుకున్నారు.

కోటా శ్రీనివాసరావు నాకు అత్యంత ఆప్తుడు. ఆయన అకాల మరణం రోజు నేను హైదరాబాద్ లో లేను. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు. 1987 సంవత్సరంలో వీరప్రతాప్ సినిమాలో మాంత్రికుడుగా అవకాశం ఇచ్చారు. మా బ్యానర్‌లో బయట బ్యానర్‌లలో ఆయనతో చాలా సినిమాలు చేశాము. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగలిగిన నటుడు. ఏ డైలాగ్ అయినా.. విలన్‌గా, కమెడియన్‌గా డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడ్యులేషన్ చెప్పగలిగే నటుడు కోట శ్రీనివాసరావు అని మోహన్ బాబు గుర్తుచేశారు.

కోట శ్రీనివాసరావు మా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు, ఆయన మరణం నా కుటుంబానికే కాకుండా సినిమా పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నానని మోహన్ బాబు అన్నారు.