Dudum Dukkudum Song : ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల’ కోసం మంగ్లీ పాడిన పాట.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ చేతుల మీదుగా..
‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ అనే సినిమా నుంచి ఆల్రెడీ టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు.

Mangli Dudum Dukkudum Song Released From Prabuthwa Junior Kalashala Punganuru Movie by GV Prakash Kumar
Dudum Dukkudum Song : కాలేజీలో టీనేజ్ ప్రేమ కథాంశంతో రాబోతున్న సినిమా ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై కొవ్వూరి అరుణ సమర్పణలో భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మాణంలో కొత్త దర్శకుడు శ్రీనాథ్ పులకురం దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో.. ప్రణవ్ సింగంపల్లి, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక.. ఇలా పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143′ అనే టైటిల్ అనౌన్స్ తోనే ఆసక్తి నెలకొంది ఈ సినిమాపై. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. ఆల్రెడీ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సింగర్ మంగ్లీ(Mangli) ఈ పాట పాడింది. ‘డూడుం డుక్కుడుం..’ అంటూ ఈ పాట మంగ్లీ వాయిస్ లో క్లాసికల్ టచ్ తో సాగింది. ఈ పాటని శ్రీ సాయి కిరణ్ రాయగా కార్తీక్ రోడ్రిగ్జ్ సంగీత దర్శకత్వంలో పాడారు.
Also Read : R Narayana Murthy : విశాఖ ఉక్కు ఉద్యమంపై పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా?
తాజాగా ఈ పాటని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. పాట మొత్తం విన్న జీవి ప్రకాష్ అద్భుతంగా చిత్రయూనిట్ ని అభినందించారు. ఈ సినిమా కచ్చితంగా మ్యూజికల్ హిట్ అవుతుందని చెప్పారు జీవి. ఈ సినిమా ఆడియో హక్కులను టీ సిరీస్ తెలుగు సంస్థ మంచి రేటుకి దక్కించుకోగా ఈ పాట అదే యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేశారు. ప్రస్తుతం మంగ్లీ పాడిన ఈ పాట ప్రేక్షకులని అలరిస్తుంది.