Manoj Bajpayee : నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది..
ఇటీవలే కొన్ని రోజుల క్రితం యాంకర్, నటి విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. కొన్ని రోజుల క్రితమే కన్నడ నటుడు కిషోర్ అకౌంట్ హ్యాక్ అయింది. తాజాగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు.............

Manoj Bajpayee's Twitter account hacked
Manoj Bajpayee : కొంతమంది హ్యాకర్లు సెలబ్రిటీలని టార్గెట్ చేసి వారి అకౌంట్స్ ని హ్యాక్ చేస్తున్నారు. టాలీవుడ్, తమిళ్, బాలీవుడ్, కన్నడ.. ఇలా అన్ని పరిశ్రమలలో పలువురి సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ చాలా సార్లు హ్యాక్ అయ్యాయి. మళ్ళీ మళ్ళీ ఇది రిపీట్ అవుతూనే ఉంది.
ఇటీవలే కొన్ని రోజుల క్రితం యాంకర్, నటి విష్ణుప్రియ ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. కొన్ని రోజుల క్రితమే కన్నడ నటుడు కిషోర్ అకౌంట్ హ్యాక్ అయింది. తాజాగా బాలీవుడ్ స్టార్ యాక్టర్ మనోజ్ బాజ్‌పేయి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు.
Asian Film Awards : ఏషియన్ ఫిల్మ్ అవార్డ్స్ నామినేషన్స్ లో RRR, పొన్నియిన్ సెల్వన్ 1..
మనోజ్ బాజ్‌పేయి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో.. నా ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఎవరూ నా ట్విట్టర్ జోలికి వెళ్ళకండి. నా అకౌంట్ నుంచి ఎలాంటి పోస్టులు వచ్చినా పట్టించుకోకండి. దాని మీద వర్క్ చేస్తున్నారు. సమస్య సాల్వ్ అయ్యాక మళ్ళీ నేనే మీకు అప్డేట్ ఇస్తాను. అంతవరకు నా ట్విట్టర్ జోలికి ఎవరూ వెళ్ళకండి అని పోస్ట్ చేశాడు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.