Varun Dhawan: మనోజ్​ భాయ్​ మిస్​ యూ సోమచ్​.. డ్రైవర్​కు వరుణ్​ భావోద్వేగపు నివాళి!

బాలీవుడ్​ యంగ్​ హీరో వరుణ్​ ధావన్ గుండెపోటుతో మరణించిన డ్రైవర్ కు భావోద్వేగపు నివాళి అర్పించారు. తాజాగా వరుణ్ సోషల్​ మీడియా వేదికగా ఎమోషనల్​గా పోస్ట్​ చేశాడు. ఇది చూసిన వరుణ్​​..

Varun Dhawan: మనోజ్​ భాయ్​ మిస్​ యూ సోమచ్​.. డ్రైవర్​కు వరుణ్​ భావోద్వేగపు నివాళి!

Varun Dhawan

Updated On : January 22, 2022 / 8:27 PM IST

Varun Dhawan: బాలీవుడ్​ యంగ్​ హీరో వరుణ్​ ధావన్ గుండెపోటుతో మరణించిన డ్రైవర్ కు భావోద్వేగపు నివాళి అర్పించారు. తాజాగా వరుణ్ సోషల్​ మీడియా వేదికగా ఎమోషనల్​గా పోస్ట్​ చేశాడు. ఇది చూసిన వరుణ్​​ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. వరుణ్‌ ధావన్‌ దగ్గర పనిచేస్తున్న డ్రైవర్‌ మంగళవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. బాంద్రాలోని మెహబూబ్‌ స్డూడియోలో సినిమా షూటింగ్‌ జరుగుతుండగా వరుణ్‌ డ్రైవర్‌ మనోజ్ సాహు గుండెపోటుకి గురవగా ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.

Telugu Small Movies: రిలీజ్ కష్టాలు.. చిన్న సినిమాలకు పెద్ద చిక్కులు!

డ్రైవర్ మనోజ్ మరణంతో వరుణ్‌ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. వరుణ్​తో 26 ఏళ్లపాటు కలిసున్న మనోజ్​ సాహు మంగళవారం గుండెపోటుతో మరణించారు. మనోజ్ సాహు మరణంపై బుధవారం నుండే తన సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్స్ పెడుతున్నాడు. తాజాగా మనోజ్​కు నివాళిగా తన ఇన్​స్టా గ్రామ్​ స్టోరీలో వరుణ్ ఓ పోస్ట్​ పెట్టాడు. బీచ్​లో లవ్​ షేప్​లో ఇసుకను పేర్చి అందులో ‘మనోజ్​ భాయ్​ మిస్​ యూ సోమచ్​’ అని రాశాడు.

Unstoppable with NBK: మాన్ ఆఫ్ మాసెస్.. రియలిస్టిక్ బిహేవియర్.. అందుకే హిట్!

ఈ పోస్ట్ వరుణ్ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. వరుణ్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీకి అభిమానులు అంతే భావోద్వేగంతో స్పందించారు. ‘అందంగా ఉంది. మనోజ్​ భాయ్ స్వర్గం నుంచి ఇది చూసి చిరునవ్వు చిందిస్తాడు.’ అని ఒక అభిమాని కామెంట్ చేయగా.. ‘ఈ పోస్ట్​తో మీరు నా హృదయాన్ని గెలుచుకున్నారు. దేవుడు మీకు ధైర్యాన్ని ఇవ్వాలి.’ అని మరొకరు రాశారు.