మార్కెట్ రాజా MBBS – ట్రైలర్

ఆరవ్, కావ్య థాపర్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన 'మార్కెట్ రాజా MBBS' ట్రైలర్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : September 24, 2019 / 07:57 AM IST
మార్కెట్ రాజా MBBS – ట్రైలర్

Updated On : September 24, 2019 / 7:57 AM IST

ఆరవ్, కావ్య థాపర్, రాధికా శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మార్కెట్ రాజా MBBS’ ట్రైలర్ రిలీజ్..

బిగ్ బాస్ (తమిళ్) ఫేమ్ ఆరవ్ హీరోగా తమిళనాట ‘మార్కెట్ రాజా MBBS’ అనే సినిమా రూపొందుతుంది. సురభి ఫిలింస్ బ్యానర్‌పై ఎస్.మోహన్ నిర్మిస్తుండగా.. శరణ్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. సీనియర్ నటి, వెండితెరతో పాటు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న రాధికా శరత్ కుమార్ కీలక పాత్ర పోషించింది.

ఆమె డిఫరెంట్, ఊరమాస్ గెటప్‌లో కనిపించనుంది.  రాధిక ఈ సినిమాలో డాన్ పాత్ర చేస్తుంది. మార్కెట్ రాజాలో ఆమె బుల్లెట్ కూడా నడపడం విశేషం. ఇందులో రాధికది డేరింగ్ అండ్ డాషింగ్ క్యారెక్టర్ అని తెలుస్తుంది. దర్శకుడు శరణ్ అన్నయ్య, 118 తో టాలీవుడ్‌‌లో డైరెక్టర్‌గా టర్న్ అయిన ఫేమస్ డీఓపీ కె.వి.గుహన్ ఈ సినిమాకి కెమెరామెన్..

Read Also : అక్టోబర్ 26న దాసరి అవార్డ్స్..

నాజర్, ప్రదీప్ రావత్, షాయాజీ షిండే, ఆదిత్య మీనన్, రోహిణి, నికిషా పటేల్ తదితరులు నటించిన ‘మార్కెట్ రాజా MBBS’ త్వరలో విడుదల కానుంది. సంగీతం : సిమోన్ కె కింగ్, కెమెరా : కె.వి.గుహన్, ఎడిటింగ్ : గోపికృష్ణ, కొరియోగ్రఫీ : కళ్యాణ్, దినేష్.