Akhanda: మాస్.. మాస్.. మాస్.. దంచికొడుతున్న కలెక్షన్లు!

ఆయన నటసింహం.. కరెక్ట్ పాత్ర పడితే ఆ సింహం జూలు విదిల్చి చెలరేగిపోతుంది. అఖండ సినిమా చూసిన వాళ్ళు చెప్పే మాట ఇదే. సినిమాలో బాలయ్య ఒక్కడే కనిపిస్తాడు.. ఆయన డైలాగ్స్ మాత్రమే..

Akhanda: మాస్.. మాస్.. మాస్.. దంచికొడుతున్న కలెక్షన్లు!

Akhanda (1)

Akhanda: ఆయన నటసింహం.. కరెక్ట్ పాత్ర పడితే ఆ సింహం జూలు విదిల్చి చెలరేగిపోతుంది. అఖండ సినిమా చూసిన వాళ్ళు చెప్పే మాట ఇదే. సినిమాలో బాలయ్య ఒక్కడే కనిపిస్తాడు.. ఆయన డైలాగ్స్ మాత్రమే వినిపిస్తాయి. బాలయ్య అభిమానులకు ఏం కావాలో కొలతలు తెలిసిన దర్శకుడు బోయపాటి సినిమాను అదే మాసిజంతో నింపేశాడు. దెబ్బకి థియేటర్లు షేక్ అవుతుంటే కలెక్షన్ల మోత మోగిపోతుంది. అఖండగా బాలయ్య నటనా పూనకం.. థియేటర్లలో కూర్చున్న అభిమానులకు పూనకాలు తెప్పిస్తుంటే కాసుల వర్షం కురుస్తుంది.

RRR: గెట్ రెడీ.. ట్రైలర్ వచ్చేస్తుంది.. ఇక రచ్చ రచ్చే!

మొత్తంగా బాలయ్య-బోయపాటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ కొట్టేయగా తొలి రోజే భారీ కలెక్షన్లతో అఖండ సినిమాకు భారీ బూస్టప్ ఇచ్చింది. ఇక్కడా.. అక్కడా అని లేకుండా.. అమలాపురం నుండి అమెరికా వరకు కలెక్షన్ల వరద కొనసాగుతుంది. విడుదలైన రోజే బెనిఫిట్ షోలతో అఖండతో బాలయ్య మాస్ జాతర అనే టాక్ రావడంతో డే మొత్తం అదే ఊపులో కలెక్షన్ల ఊచకోత మొదలైంది. మొదటిరోజు అఖండ మూవీకి మొత్తం 23 కోట్ల గ్రాస్ 15.39 నెట్ వసూళ్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Liger: పూరి కోసం బాలయ్య.. లైగర్‌లో క్యామియో రోల్?

ఇక, తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏరియాల వారిగా కలెక్షన్స్ వివరాలు పరిశీలిస్తే.. నైజాం- 4.39 కోట్లు, సీడెడ్- 4.02 కోట్లు, ఉత్తరాంధ్ర 1.36 కోట్లు, ఈస్ట్ గోదావరి 1.05 కోట్లు, వెస్ట్ గోదావరి 96 లక్షలు, గుంటూరు 1.87 కోట్లు,
కృష్ణా 81 లక్షలు, నెల్లూరు 93 లక్షలు వసూలైనట్లుగా తెలుస్తుంది. ఇక ఓవర్సీస్ లో బాలయ్య ఎన్నడూలేని విధంగా వసూళ్లను రాబట్టాడు. ఇక్కడ ఏకంగా మూడు లక్షల డాలర్లకు పైగా కేవలం ప్రీమియర్ షోల ద్వారానే రాబట్టి అత్యధిక ప్రీమియర్ గ్రాసర్ గా నిలిచింది.

Sekhar: రాజశేఖర్ సినిమాపై ఓటీటీల చూపు.. కళ్ళు చెదిరే ధర!

ఈ ఏడాదిలో అఖండను మించి మరే సినిమా ఆ స్థాయి వసూళ్లను దక్కించుకోకపోగా.. తొలిరోజే మూడు లక్షల డాలర్ల వసూళ్లు రాబట్టిన అఖండ లాంగ్ రన్ లో రెండు మిలియన్ డాలర్ల వరకు వెళ్తుందనే నమ్మకంతో ఉన్నారు. మరో మూడు రోజులు వీకెండ్ కూడా తోడవడంతో బాలయ్య రికార్డుల పరంపర కొనసాగడం ఖాయంగా కనిపిస్తుండగా మాస్ లో అఖండకు భారీ ఆదరణ కనిపిస్తుండడంతో సునాయాసంగా తొలి వారంలో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. ట్రేడ్ లెక్కల ప్రకారం రూ.54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన అఖండ రూ.55 కోట్ల బ్రేక్ ఈవెన్ సునాయాసంగా దాటేస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.