Meera Jasmine : తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్.. ఆ హీరో సినిమాతో..

తాజాగా నేడు మీరా జాస్మిన్ ఈ సినిమాతో తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందని ప్రకటించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Meera Jasmine : తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న మీరా జాస్మిన్.. ఆ హీరో సినిమాతో..

Meera Jasmine Re Entry into Telugu Movies with Sree Vishnu Swag Movie

Updated On : June 2, 2024 / 10:31 AM IST

Meera Jasmine : తెలుగులో అమ్మాయి బాగుంది, భద్ర, రారాజు, గుడుంబా శంకర్, గోరింటాకు.. లాంటి సూపర్ హిట్ సినిమాలు చేసిన మీరా జాస్మిన్ ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. 2014లో వివాహం చేసుకొని మీరా జాస్మిన్ సినిమాలకు దూరమైంది. భర్తతో విడిపోయిన తర్వాత ఇటీవల ఓ మలయాళం సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తుంది. ఆల్రెడీ ఓ తమిళ్ – తెలుగు సినిమా విమానంతో తెలుగు ప్రేక్షకులను మళ్ళీ పలకరించినా ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇస్తుంది మీరా జాస్మిన్.

Also Read : Bujji & Bhairava : కల్కి ‘బుజ్జి & భైరవ’ యానిమేషన్ సిరీస్ రివ్యూ.. ప్రభాస్‌ని మరీ ఇంత కామెడీగా చూపించారేంట్రా బాబు..

హీరో శ్రీవిష్ణు సినిమాతో మీరా జాస్మిన్ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది. ఇటీవల సామజవరగమన, ఓం భీమ్ బుష్.. సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన శ్రీవిష్ణు త్వరలో ‘స్వాగ్’ అనే ఓ సినిమాతో రాబోతున్నాడు. శ్రీవిష్ణుతో రాజ రాజ చోర సినిమా తీసి హిట్ కొట్టిన దర్శకుడు హసిత్ గోలి ఈ ‘స్వాగ్’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

తాజాగా నేడు మీరా జాస్మిన్ ఈ సినిమాతో తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుందని ప్రకటించి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మహారాణిలా తయారయి మీరా జాస్మిన్ ఈ ఫస్ట్ లుక్ లో మెరిపిస్తుంది. దీంతో మీరా జాస్మిన్ పోస్టర్ వైరల్ అవ్వగా ఆమె తెలుగు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.