Naga Babu: పవన్ పై మెగాబ్రదర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. అప్పుడు మార్గనిర్దేశం చేశా.. ఇప్పుడు అడుగుజాడల్లో నడుస్తున్నా
ఓ ఫోటోను షేర్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ ఫోటోలో పవన్ ముందు నడుస్తుండగా ఆ వెనుక నాగబాబు నడుస్తున్నట్లుగా ఉంది.

Naga Babu-Pawan Kalyan
Naga Babu-Pawan Kalyan: మెగా బ్రదర్ నాగబాబు(Naga Babu) ఇంట్లో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొంది. ఆయన కుమారుడు హీరో వరుణ్‌తేజ్(Varun Tej) నిశ్చితార్థం శుక్రవారం(జూన్ 9) హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya tripathi)తో జరిగింది. వరుణ్ తేజ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమానికి మెగా, అల్లు కుటుంబాలతో పాటు లావణ్య ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులు మధ్య చాలా సింపుల్‌గా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్‌గా మారాయి.
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఓ ఫోటోను షేర్ చేశారు మెగా బ్రదర్ నాగబాబు. ఈ ఫోటోలో పవన్ ముందు నడుస్తుండగా ఆ వెనుక నాగబాబు నడుస్తున్నట్లుగా ఉంది. ఈ ఫోటోను షేర్ చేసిన నాగబాబు.. పవన్ కి చిన్నప్పుడు ఎలా నడుచుకోవాలి, ఎలా అడుగులు వేయాలి, మంచి, చెడులపై తాను మార్గనిర్దేశం చేసినట్లు చెప్పుకొచ్చాడు. అయితే.. ‘ఇప్పుడు ఇద్దరం పెద్దవాళ్లము అయ్యాం. తాను ఎటువైపు వెళ్లాలి, ఏం చేయాలి అన్న దానిపై పవన్‌కు స్పష్టమైన, లోతైన అవగాహన ఉంది. ఆ మార్గంలోనే వెలుతున్నాడు. నేను ఇప్పుడు అతడి అడుగుజాడల్లో నడుస్తున్నాను.’ అంటూ నాగబాబు రాసుకొచ్చాడు. ప్రస్తుతం నాగబాబు పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.
View this post on Instagram
ప్రజలకు సేవ చేయాలని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. పార్టీలో క్రియాశీలంగా పని చేస్తున్న నాగబాబుకు ఇటీవలే పార్టీకి సంబంధించిన కీలక పదవిని ఇవ్వడం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి విస్తృతంగా ప్రచారం చేయడానికి తన పూర్తి సమయాన్ని రాజకీయాలకే పరిమితం చేయాలని నాగబాబు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
Allu Arjun : వరుణ్ – లావణ్య నిశ్చితార్థంపై బన్నీ కామెంట్.. మా నాన్న ముందే చెప్పాడంటూ..
ఇదిలా ఉంటే.. జూన్ 14 నుంచి ఎన్నికల ప్రచార వాహనం ‘వారాహి’లో యాత్ర ప్రారంభించనున్నారు పవన్ కళ్యాణ్. ఉభయ గోదావరి జిల్లాల్లో ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఆ యాత్రలో నాగబాబు కూడా పాల్గొనున్నట్లు తెలిపారు.