Ram Charan New Look : ఆచార్య ‘సిద్ధ’ న్యూ లుక్ అదిరిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త మూవీ ఆచార్య. ఈ మూవీలో చిరుతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. తాజాగా ఆచార్య మూవీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్టర్ రిలీజ్ అయింది.

Ram Charan New Look : ఆచార్య ‘సిద్ధ’ న్యూ లుక్ అదిరిందిగా..!

Ram Charan New Look

Updated On : July 10, 2021 / 6:01 PM IST

Ram Charan as Siddha New Look from Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త మూవీ ఆచార్య. ఈ మూవీలో చిరుతోపాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్నాడు. తాజాగా ఆచార్య మూవీ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ పోస్టర్‌లో చరణ్.. సిద్ధ న్యూ లుక్ అదిరింది. గుబురు మీసాలతో, మెడలో రుద్రాక్ష ధరించగా.. నుదిటిన బొట్టుతో చరణ్ కనిపించాడు. ఆచార్యలో సిద్ద అనే పాత్రలో చరణ్ నటిస్తున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, పోస్టర్లు, సాంగ్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. చిరుకు జోడీగా కాజల్ అగర్వార్ నటిస్తుంటే.. చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తోంది. చిరు, చరణ్ కలిసి నటిస్తున్న ఆచార్యలో వీరిద్దరూ నక్సలైట్స్‌గా కనిపించనున్నారు.

కరోనా కారణంగా మూవీ షూటింగ్ వాయిదా పడింది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఇక ఫైనల్ షెడ్యూల్‌ను పూర్తి చేయాల్సి ఉంది. ఆచార్యతో పాటు జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR మూవీలోనూ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో అల్లూరిసీతారామరాజు‌గా కనిపించనున్నాడు.