Hero Ram Charan : ముంబైలో చెర్రీ ఇల్లు.. బాలీవుడ్ సినిమాల కోసమేనా
చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబై లోని సముద్రతీరంలో అధునాతన బంగ్లాను కొనుగోలు చేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Ram Charan New Bungalow In Mumbai
Hero Ram Charan : చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముంబై లోని సముద్ర తీరంలో అధునాతన బంగ్లాను కొనుగోలు చేశారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే తన భార్య ఉపాసనా తో కలిసి ఆ ఇంట్లో గృహప్రవేశం కూడా చేశారని తెలుస్తోంది.
నటీ నటులు షూటింగ్స్ కోసం వివిధ ప్రదేశాలకు వెళుతూ ఉంటారు. అక్కడ వారు హోటల్స్‌లో బస చేస్తారు. ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న రామ్‌చరణ్ తరచూ ముంబై వెళ్లి నిర్మాతలను కలిసి వస్తున్నారు. ఈ నేపధ్యంలో ప్రతిసారి హోటళ్లలో దిగటం… వాటికి వేలకు వేలు ఖర్చు చేయటం ఎందుకనే ఆలోచనలోనే ఇల్లు కోనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
ముంబై శివారులో సంపన్నులు నివసించే ప్రాంతమైన ఖర్ లో ఇల్లు కొనుగోలు చేయటం పెట్టుబడిగానే కాకుండా తనకు చాలా ఉపయోగం ఉంటుందని ఈనిర్ణయం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. రామ్ చరణ్ కొనుగోలు చేసిన ఇల్లు బీచ్ ఫేసింగ్‌లో ఎంతో విలాసవంతంగా ఉందని… చరణ్ ఫ్యామిలీతో సహా ముంబై వెళ్లి ఎన్నిరోజులైన అక్కడే స్టే చేసే విధంగా ఇల్లు కొనుగోలు చేశారని తెలుస్తోంది.
ఏది ఏమైనా రామ్ చరణ్ ముంబైలో ఇల్లు కొనుగోలు చేశారనే వార్త ప్రస్తుతం ఫిలింనగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపిస్తారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. ఈ సినిమాలో కియారా అద్వానీ హిరోయిన్ గా నటిస్తోంది. ఇది కాకుండా మెగాస్టార్ చిరు నటిస్తున్న ఆచార్య సినిమాలో కూడా చరణ్ మరొక కీలక పాత్ర పోషిస్తున్నారు.