Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్రేజ్ మాములుగా లేదుగా.. 126 అడుగుల కట్ అవుట్..

126 అడుగుల కట్ అవుట్ తో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్రేజ్ మాములుగా లేదుగా..

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ క్రేజ్ మాములుగా లేదుగా.. 126 అడుగుల కట్ అవుట్..

Mega Prince Varun Tej Operation Valentine poster 126 feet cut out

Updated On : January 19, 2024 / 5:28 PM IST

Varun Tej : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు నేడు జనవరి 19న కావడంతో మెగా ఫ్యాన్స్.. బర్త్ డే విషెస్ తెలియజేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈక్రమంలోనే కొందరు అభిమానులు భారీ కట్ అవుట్ ఏర్పాటు చేసి వరుణ్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అందరికి తెలియజేశారు. వరుణ్ తేజ్ నటించిన కొత్త సినిమా ‘ఆపరేషన్ వాలెంటైన్’ రిలీజ్ కి సిద్దమవుతుంది. ఈ సినిమాలో వరుణ్ జెట్ ఫైటర్ గా కనిపించబోతున్నారు.

ఇక ఈ మూవీ పోస్టర్‌నే దాదాపు 126 అడుగుల కట్ అవుట్ ని సూర్యాపేటలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కట్ అవుట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మెగా అభిమానులు ఈ ఫోటోలను రీ షేర్ చేస్తూ మరోసారి వరుణ్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.

ఆపరేషన్ వాలెంటైన్ సినిమా విషయానికి వస్తే.. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుంది. సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో ఇతర దేశంలోకి వెళ్లి అక్కడ ఫైట్ చేసే పోరాట సన్నివేశాలతో థ్రిల్లర్ యాక్షన్ తో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

Also read : Shah Rukh Khan : మిషన్‌ ఇంపాజిబుల్‌, జాన్ విక్ చిత్రాలతో.. ఇంటర్నేషనల్ అవార్డుల్లో షారుఖ్ సినిమాలు పోటీ..

తెలుగు, హిందీ లాంగ్వేజ్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవలే ఈ మూవీ నుంచి ‘వందేమాతరం’ అంటూ మొదటి పాటని ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఫిబ్రవరి 16న ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఇక ఈ బర్త్ డే సందర్భంగా వరుణ్ నటిస్తున్న కొత్త సినిమా ‘మట్కా’ మూవీ గ్లింప్స్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో వరుణ్ మాస్ రోల్ లో కనిపించి అదరగొడుతున్నారు.

1960 బ్యాక్‌డ్రాప్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా కరుణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా, నోరా ఫతేహి, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలు చేస్తున్నారు.