Chiranjeevi : చరణ్ కూతురు ఎంట్రీ.. మెగాస్టార్‌కు ఎంత మంది మనవరాళ్లో తెలుసా..?
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. అయితే..చిరంజీవికి ఎంత మంది మనరాళ్లు ఉన్నారు అనే ప్రశ్న ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది.
![Chiranjeevi : చరణ్ కూతురు ఎంట్రీ.. మెగాస్టార్‌కు ఎంత మంది మనవరాళ్లో తెలుసా..? Chiranjeevi : చరణ్ కూతురు ఎంట్రీ.. మెగాస్టార్‌కు ఎంత మంది మనవరాళ్లో తెలుసా..?](https://10tv.in/wp-content/uploads/2023/06/Chiranjeevi-Granddaughters.jpg)
Chiranjeevi Granddaughters
Chiranjeevi Granddaughters : మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్-ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో మెగా కుటుంబంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఉపాసన మంగళవారం తెల్లవారుజామున జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకి జన్మినిచ్చింది. ఇప్పటికే ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తమకెంతో ఇష్టమైన మంగళవారం రోజే చిన్నారి జన్మించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చినట్లు చెప్పారు.
Pawan Kalyan : మెగా వారసురాలి పై పవన్ ట్వీట్
వివాహామైన దాదాపు 11 సంవత్సరాల తరువాత రామ్‌చరణ్-ఉపాసనలు తల్లిదండ్రులు కావడంతో చిరంజీవి మరోసారి తాత అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా.. చిరుకి ఇద్దరు కూతుళ్లు సుష్మిత, శ్రీజ కొడుకు రామ్‌చరణ్ అన్న సంగతి తెలిసిందే. అయితే..చిరంజీవికి ఎంత మంది మనరాళ్లు ఉన్నారు అనే ప్రశ్న ప్రస్తుతం ఆసక్తిని కలిగిస్తోంది. ఈ విషయం తెలుసుకోవాలని నెటీజన్లు నెట్టింట తెగ వెతికేస్తున్నారు.
చిరంజీవికి ఇప్పటికే నలుగురు మనవరాళ్లు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య ఐదుకు చేరింది. పెద్ద కూతురు సుష్మితకు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఇందులో ఒకమ్మాయి పేరు సమర కాగా మరొకరి పేరు సంహిత.
Ram Charan- Upasana: మెగా కుటుంబంలో సంబరాలు.. ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఉపాసన
![Sushmita daughters](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/06/Sushmita-daughters.jpg)
Sushmita daughters
ఇక రెండో అమ్మాయి శ్రీజకు సైతం ఇద్దరు ఆడపిల్లలు. వారి పేర్లు నివృత్తి, నవిష్క.
![Srija Daughters](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2023/06/srija-daughters.jpg)
Srija Daughters
ఇక కుమారుడు రామ్‌చరణ్‌కు సైతం నేడు(జూన్ 20)ఆడబిడ్డే కలగడంతో చిరంజీవికి మొత్తం ఐదుగురు మనవరాళ్లు అయ్యారు.