Vishwambhara : చిరంజీవి ‘విశ్వంభర’ షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? భారీ సెట్‌లో.. ఏ సీన్ తీస్తున్నారో తెలుసా?

తాజాగా విశ్వంభర షూట్ అప్డేట్ వచ్చింది.

Vishwambhara : చిరంజీవి ‘విశ్వంభర’ షూట్ ఎక్కడ జరుగుతుందో తెలుసా? భారీ సెట్‌లో.. ఏ సీన్ తీస్తున్నారో తెలుసా?

Megastar Chiranjeevi Vishwambhara Movie Shooting Update

Updated On : April 2, 2024 / 10:25 AM IST

Vishwambhara Shooting Update : మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ప్రస్తుతం డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సోషియో ఫాంటసీగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తూ మళ్ళీ తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే భారీ సెట్స్ వేసి షూటింగ్స్ చేస్తున్నారని సమాచారం వచ్చింది. మరో పక్క మ్యూజిక్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి.

తాజాగా విశ్వంభర షూట్ అప్డేట్ వచ్చింది. విశ్వంభర మూవీ షూట్ నేటి నుంచి ఏప్రిల్ 19 వరకు హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో జరగనుంది. ఇంటర్వెల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయబోతున్నారని సమాచారం. విలన్ గ్యాంగ్ తో ఫైటింగ్ సీన్స్ ఉండనున్నాయి. లక్ష బీర్ బాటిల్స్ తో ఓ బీర్ ఫ్యాక్టరీ లాంటి సెట్ వేసి ఈ యాక్షన్ సీక్వెన్స్ లు చేస్తున్నారని తెలుస్తుంది.

Also Read : Mahesh Babu : వైరల్ అవుతున్న మహేష్ బాబు కొత్త లుక్స్.. ట్రెండ్ అవుతున్న SSMB29

ఇక విశ్వంభర సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మెగా అభిమానులు ఈ సరికొత్త సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంజి తర్వాత చాలా గ్యాప్ తో సోషియో ఫాంటసీ సబ్జెక్టు మెగాస్టార్ చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.