Sumanth Prabhas : బ్యాంక్ అకౌంట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ నా ఇన్స్పిరేషన్.. ‘మేము ఫేమస్’ సుమంత్ ప్రభాస్

తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన మేము ఫేమస్ సినిమా ఇప్పటికే 5 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ప్రాఫిట్ జోన్ లో ఉంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు సుమంత్ ప్రభాస్. దీంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సుమంత్.

Sumanth Prabhas : బ్యాంక్ అకౌంట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ నా ఇన్స్పిరేషన్.. ‘మేము ఫేమస్’ సుమంత్ ప్రభాస్

Mem Famous Sumanth Prabhas comments on Vijay Devarakonda

Updated On : June 2, 2023 / 1:01 PM IST

Mem Famous : సుమంత్ ప్రభాస్.. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేసుకుంటూ పేరు సంపాదించుకున్నాడు. సినీ పరిశ్రమలో డైరెక్టర్ గా, యాక్టర్ గా ఎప్పట్నుంచో ట్రై చేస్తున్నాడు. ఇటీవలే మేము ఫేమస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్. ఈ సినిమాకు రైటర్, డైరెక్టర్, హీరో అన్ని అతనే. ఈ సినిమా భారీ విజయం సాధించింది. టాలీవుడ్ లో మహేష్ బాబు, రాజమౌళి.. పలువురు స్టార్ హీరోలు, యాక్టర్స్ సైతం మేము ఫేమస్ సినిమాను చూడమని చెప్తూ, సుమంత్ ని అభినందిస్తున్నారు.

తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన మేము ఫేమస్ సినిమా ఇప్పటికే 5 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ప్రాఫిట్ జోన్ లో ఉంది. ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు సుమంత్ ప్రభాస్. దీంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు సుమంత్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ.. కనీసం నాకు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. ఈ సినిమాకు అడ్వాన్స్ ఇస్తాం, బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పు అంటే నా దగ్గర లేదు అన్నాను. నాకు అసలు స్టేజి మీద మాట్లాడటం రాదు. కానీ విజయ్ దేవరకొండ ను చూసి నేర్చుకున్నాను. విజయ్ దేవరకొండ నాకు ఇన్స్పిరేషన్. నాకే కాదు ఇప్పుడు చాలా మంది యూత్ కి ఆయన ఇన్స్పిరేషన్. ఓన్ గా కష్టపడి స్టార్ అయ్యారు అని తెలిపాడు.

Nenu Student Sir Twitter Review : నేను స్టూడెంట్ సర్ ట్విట్టర్ రివ్యూ.. మాములుగా లేదట.. ఇంటర్వెల్ అదిరిపోయింది..

అలాగే.. మా అమ్మ సినిమా ఇండస్ట్రీకి అంటే భయపడింది. కానీ ఇప్పుడు అందరూ అభినందిస్తుంటే మా అమ్మకి చూపించి చెప్తున్నాను టాలీవుడ్ మొత్తం నా వెనక ఉందని. కంటెంట్ కరెక్ట్ గా ఉంటే మనం సాధించొచ్చు అని తెలిపాడు సుమంత్. ఇక సుమంత్ కి నెక్స్ట్ సినిమా మహేష్ బాబు నిర్మాణంలో అవకాశం ఇప్పటికే వచ్చేసింది.