మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌ – రివ్యూ

  • Published By: sekhar ,Published On : November 20, 2020 / 02:13 PM IST
మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌ – రివ్యూ

Middle Class Melodies Review: ‘దొరసాని’ చిత్రంతో హీరోగా పరిచయం అయిన క్రేజీ స్టార్ విజయ్‌ దేవరకొండ తమ్ముడు ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన సెకండ్ మూవీ ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’..

వినోద్ అనంతోజుని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌తో ఆకట్టుకున్న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా ఎలా ఉందో చూద్దాం..


కథ
గుంటూరు సమీపంలోని కొలకలూరు గ్రామంలో ఉండే యువకుడు రాఘవ(ఆనంద్‌ దేవరకొండ). తండ్రి కొండలరావు(గోపరాజు రమణ), తల్లి లక్ష్మి(సురభి ప్రభావతి)తో కలిసి రాఘవ ఓ చిన్న హోటల్‌ నడుపుతుంటాడు.

రాఘవది బొంబాయి చట్నీ చేయడంలో ఆరితేరిన చేయి. తన బొంబాయి చట్నీని గుంటూరుకి రుచి చూపించాలంటే అక్కడ ఓ హోటల్‌ పెట్టాలని నిర్ణయించుకుంటాడు. అయితే రాఘవ తండ్రికి మాత్రం ఆ పని ఇష్టం ఉండదు.



రాఘవ తండ్రి మనసులో ఏదీ దాచుకోని రకం. మొహం మీద ఏ విషయాన్ని అయినా చెప్పేస్తాడు. కానీ రాఘవ తన ఫ్యామిలీని ఒప్పిస్తాడు. మరో వైపు గుంటూరులోని తన మరదలు సంధ్య(వర్షా బొల్లమ్మ)ను ప్రేమిస్తాడు.

ఆమె తండ్రిని గుంటూరులో హోటల్‌ పెట్టడానికి సాయం అడుగుతాడు. అప్పుడు అతను ఏం చేస్తాడు? రాఘవ కల నేరవేరిందా? హోటల్‌ పెట్టి రాఘవ సక్సెస్‌ అయ్యాడా? రాఘవ, సంధ్య ప్రేమకథ ఏమైంది? అనేది మిగతా కథ..


నటీనటులు
ఆనంద్‌ దేవరకొండ ఫస్ట్ మూవీ కంటే కాస్త బెటర్‌గానే కనిపించాడని చెప్పాలి. సహజంగా నటించే ప్రయత్నం చేశాడు. హీరో తండ్రి పాత్ర చేసిన గోపరాజు రమణ పాత్రలో ఒదిగిపోయారు.

వర్షా బొల్లమ్మ కూడా తన పాత్ర న్యాయం చేసింది. హీరో స్నేహితుడిగా చేసిన చైతన్య కూడా చక్కగా చేశాడు. చివర్లో వచ్చే తరుణ్‌ భాస్కర్‌ పాత్ర ఏమంత ఆసక్తికరంగా అనిపించదు.


ఎలా ఉందంటే
సినిమా టైటిల్‌కు సరిపోయేలా మధ్య తరగతి జీవితాల చుట్టూ తిరిగే కథ. సినిమాలో తండ్రీ, కొడుకుల మధ్య జరిగే గొడవలు చూస్తే ప్రతి మధ్య తరగతి ఇంట్లో జరిగే వ్యవహారంలా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్‌ మధ్య లవ్‌ ట్రాక్‌ ఓకే.

ఇక ఫస్టాఫ్ లో హీరో తన కల గురించి అంటే గుంటూరులో హోటల్‌ పెట్టడానికి ప్రయత్నాలు చేయడం.. ఇబ్బందులు రావడం, వాటిని దాటడానికి ప్రయత్నించడం వంటి సన్నివేశాలతోనే సాగుతుంది. ఇక సెకండాఫ్ కూడా అదే హోటల్‌ ప్రాబ్లమ్ తోనే నడుస్తుంది.


కథను మరీ నేచురుల్ గా చెప్పే ప్రయత్నంలో డైరెక్టర్‌ తెరమీద గ్రిప్పింగ్‌గా చూపించలేకపోయాడు. ఎమోషనల్‌ కనెక్టివిటీ ఎక్కడో మిస్‌ అయిన ఫీలింగ్‌ వస్తుంది. పాటలు, నేపథ్య సంగీతం ఓకే.. విజువల్స్‌ కూడా బాగున్నాయి.