Milky Beauty Song Promo : మిల్కీ బ్యూటీ.. నువ్వేనా స్వీటీ.. అంటూ తమన్నాతో చిరు స్టెప్స్ అదుర్స్

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మెహర్ రమేష్ (Meher Ramesh) ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న చిత్రం భోళా శంక‌ర్ (Bhola Shankar).

Milky Beauty Song Promo : మిల్కీ బ్యూటీ.. నువ్వేనా స్వీటీ.. అంటూ తమన్నాతో చిరు స్టెప్స్ అదుర్స్

Milky Beauty Song Promo

Updated On : July 20, 2023 / 8:29 PM IST

Bholaa Shankar-Milky Beauty Song Promo : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) మెహర్ రమేష్ (Meher Ramesh) ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న చిత్రం ‘భోళా శంక‌ర్’ (Bhola Shankar). ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా త‌మ‌న్నా(Tamannaah) క‌థానాయిక‌గా న‌టిస్తోంది. సుశాంత్‌, కీర్తి సురేష్ లు కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఆగ‌స్టు 11న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు మొద‌లుపెట్టింది.

Sai Rajesh : ప్రేక్ష‌కులకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బేబీ ద‌ర్శ‌కుడు.. ఆ ఒక్క డైలాగ్ మాత్ర‌మే..!

అందులో భాగంగా చిత్ర బృందం ఇప్ప‌టికే ‘భోళా మేనియా’, ‘జామ్ జామ్ జజ్జనక’ పాటలు విడుద‌ల చేసింది. తాజాగా మూడో పాట అయిన ‘మిల్కీ బ్యూటి’ సాంగ్ ప్రోమో (Milky Beauty Song Promo) ను లాంఛ్ చేసింది. ‘మిల్కీ బ్యూటీ నువ్వేనా స్వీటీ.. అరే నీకూ నాకు డేటింగ్ పార్టీ’ అంటూ ఈ పాట సాగుతోంది. ఇందులో చిరు, త‌మ‌న్నా వేసిన స్టెప్టులు ఆక‌ట్టుకున్నాయి. ఈ పాట‌ను రామజోగయ్య శాస్త్రి రాయగా విజయ్ ప్రకాశ్‌, సంజన కల్మంజే, మహతిస్వరసాగర్ లు పాడారు.

BRO vs LGM : బాక్సాఫీస్ వ‌ద్ద ధోని, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల మ‌ధ్య ఫైట్‌..!

కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ డ్యాన్స్ కంపోజ్ చేసిన ఈ పూర్తి పాట‌ను రేపు(జూలై 21) సాయంత్రం 4 గంట‌ల 5 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది. మురళీ శర్మ, రఘుబాబు, రావు రమేశ్‌, వెన్నెల కిశోర్‌, రవి శంకర్‌, ప్రగతి, రష్మీ గౌతమ్ లు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.