Minister Roja : రామ్‌చరణ్ కూతురు పై మంత్రి రోజా ఎమోషనల్ ట్వీట్.. చరణ్‌ని చిన్నప్పుడు ఎత్తుకున్న..

రామ్‌చరణ్ కూతురు పై మంత్రి రోజా ఎమోషనల్ ట్వీట్ చేశారు. తాతయ్య అయ్యినందుకు చిరంజీవి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ మనవరాలికి..

Minister Roja : రామ్‌చరణ్ కూతురు పై మంత్రి రోజా ఎమోషనల్ ట్వీట్.. చరణ్‌ని చిన్నప్పుడు ఎత్తుకున్న..

Minister Roja emotional tweet on ram charan daughter birth

Updated On : June 30, 2023 / 4:18 PM IST

Minister Roja – Ram Charan : రామ్ చరణ్, ఉపాసన పెళ్ళైన 11 ఏళ్ళ తరువాత తమ మొదటి బిడ్డకు ఆహ్వానం పలుకుతూ మెగా కాంపౌండ్ లో ఎంతో సంతోషాన్ని తీసుకు వచ్చారు. మంగ‌ళ‌వారం జూన్ 20 తెల్ల‌వారుజామున జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్ప‌త్రిలో ఉపాస‌న పండంటి ఆడ‌బిడ్డ‌కి జ‌న్మినిచ్చింది. మెగా ప్రిన్సెస్ ఎంట్రీ గురించి సంతోషం వ్యక్తం చేస్తూ సినీ సెలబ్రిటీస్, పొలిటికల్ లీడర్స్ రామ్ చరణ్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ మంత్రి మరియు ఒకప్పటి నటి రోజా ట్వీట్ చేశారు.

Vijay Deverakonda : మహేష్, ప్రభాస్‌తో పోటీకి విజయ్ దేవరకొండ.. పరశురాంతో సినిమా సంక్రాంతికి..?

“తాతయ్య అయ్యినందుకు చిరంజీవి గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీ మనవరాలికి మీరు ఎవర్ గ్రీన్ హీరోలా నిలిచిపోతారు. ఎప్పుడు సంతోషంగా, ఒకటిగా ఉండే ఈ కుటుంబంలో లవ్లీ మెగా ప్రిన్సెస్ ఒక ఆశీర్వాదం. చరణ్ నేను నిన్న చిన్నప్పుడు ఎత్తుకున్న రోజులను గుర్తుకు చేసుకుంటున్నా. ఇప్పుడు నువ్వు నీ కూతుర్ని ఎత్తుకునే రోజు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఉపాసన మరియు మీ ఇంటి లిటిల్ మహాలక్ష్మికి ఆరోగ్యం మరియు మంచి భవిషత్తు ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా” అంటూ రోజా ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.

కాగా పాప జూన్ 20 ఉదయం 1:49 కి మంచి ఘడియల్లో పుట్టిందని, పాప జాతకం కూడా అధ్బుతంగా ఉందని నిన్న చిరంజీవి మీడియాకి తెలియజేశాడు. గత కొంత కాలంగా తమ ఇంటిలో అన్ని సంతోషకరమైన సంఘటనలే జరుగుతున్నట్లు, చరణ్ కెరీర్‌లో ఎదుగుదల, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్.. పాప జాతకం వల్లనే అని తాను నమ్ముతున్నట్లు చిరంజీవి చెప్పుకొచ్చాడు. ఈ ఆడబిడ్డ పుట్టుక తమకి ఎంతో అపురూపం అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు.