Mithila Palkar : రామ్‌చరణ్‌కి ఇష్టమైన వెబ్ సిరీస్‌.. ఫిల్మ్‌ఫేర్ అందుకున్న మిథిలా పాల్కర్..

ముంబై ముద్దుగుమ్మ 'మిథిలా పాల్కర్'.. విశ్వక్ సేన్ నటించిన 'ఓరి దేవుడా' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. టెలివిజన్ సిరీస్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ, వాటి ద్వారా మంచి పాపులారిటీనే సంపాదించుకుంది. ఇక మిథిలా నటించిన 'లిటిల్ థింగ్స్' సిరీస్‌కి అయితే స్టార్ హీరోలు సైతం అభిమానులు అయిపోయారు. ఆ ఫ్యాన్స్ లిస్ట్‌లో ఒకరు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.

Mithila Palkar : రామ్‌చరణ్‌కి ఇష్టమైన వెబ్ సిరీస్‌.. ఫిల్మ్‌ఫేర్ అందుకున్న మిథిలా పాల్కర్..

Mithila Palkar won filmfare award for little things series

Updated On : December 24, 2022 / 10:11 AM IST

Mithila Palkar : ముంబై ముద్దుగుమ్మ ‘మిథిలా పాల్కర్’.. విశ్వక్ సేన్ నటించిన ‘ఓరి దేవుడా’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. టెలివిజన్ సిరీస్ ద్వారా కెరీర్ మొదలు పెట్టిన ఈ భామ, వాటి ద్వారా మంచి పాపులారిటీనే సంపాదించుకుంది. ఇక మిథిలా నటించిన ‘లిటిల్ థింగ్స్’ సిరీస్‌కి అయితే స్టార్ హీరోలు సైతం అభిమానులు అయిపోయారు. ఆ ఫ్యాన్స్ లిస్ట్‌లో ఒకరు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్.

Ram Charan: బుచ్చిబాబుకు టెన్షన్ తెప్పిస్తున్న చరణ్.. అయోమయంలో ఫ్యాన్స్!

‘ఓరి దేవుడా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యిన చరణ్ ఆ స్టేజీ పైనే హీరోయిన్ మిథిలాతో.. “నాకు మీ ‘లిటిల్ థింగ్స్’ సిరీస్ అంటే ఇష్టం. అందులో మీ యాక్టింగ్ చాలా బాగుంటది. నెక్స్ట్ సీజన్ కోసం వెయిటింగ్, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు” అని అడిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కామెడీ సిరీస్ గాను మిథిలా పాల్కర్ ఫిల్మ్‌ఫేర్ అవార్డుని అందుకుంది.

క్రిటిక్స్ ఛాయస్ క్యాటగిరీలో సీజన్-4కి గాను బెస్ట్ ఫిమేల్ యాక్ట్రెస్ గా బ్లాక్ లేడీని అందుకుంది మిథిలా పాల్కర్. ఆ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. గతంలో 2020లో బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్‌ఫేర్ ని అందుకుంది ఈ భామ. మొత్తం నాలుగు సీజన్లు అయిన ఈ ‘లిటిల్ థింగ్స్’ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది, మీరు కూడా ఒకసారి చూసేయండి.