Movie industry: రేపు సినీ పరిశ్రమ కీలక సమావేశం.. 240 మందికి ఆహ్వానం

రేపు అనగా ఫిబ్రవరి 19వ తేదీ ఆదివారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో సినిమా పరిశ్రమ కీలక సమావేశం జరగబోతుంది.

Movie industry: రేపు సినీ పరిశ్రమ కీలక సమావేశం.. 240 మందికి ఆహ్వానం

Chamber

Updated On : February 19, 2022 / 6:27 PM IST

Movie industry: రేపు అనగా ఫిబ్రవరి 19వ తేదీ ఆదివారం ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో సినిమా పరిశ్రమ కీలక సమావేశం జరగబోతుంది. రేపు 11గంటలకు ఈ సమావేశంలో 24 క్రాఫ్ట్స్‌కి చెందిన ముఖ్యమైన ‌ప్రతినిధులు పాల్గొనబోతున్నారు.

మీటింగ్‌కి హాజరు కావాలంటూ 240మంది సభ్యులకు ఇన్విటేషన్ పంపించారు. టాప్ హీరోలు మొదలుకొని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వరకు ఆహ్వానం పంపించారు. సినీ పరిశ్రమ సమస్యలు, సినీ కార్మికుల‌ సంక్షేమంపై చర్చ జరగనున్నట్లుగా చెబుతున్నారు.

చిరంజీవి ఆధ్వర్యంలో సినీప్రముఖులతో సీఎం జగన్ మోహన్ రెడ్డి భేటీ తర్వాత ఈ సమావేశం జరుగుతుండడంతో సమావేశంపై సినిమా ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.