HariHara VeeraMallu : ‘హరిహర వీరమల్లు’కి బయ్యర్లు దొరకట్లేదంటే నమ్మశక్యంగా ఉందా? తప్పుడు వార్తలపై ఫైర్ అయిన మూవీ యూనిట్..
మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలుగునాట భారీ బిజినెస్ చేస్తుంటాయి.

Movie Unit Reacts on Pawan Kalyan HariHara VeeraMallu Business Deals Rumors
HariHara VeeraMallu : పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా అయిదేళ్ల సాగదీత తర్వాత పలు వాయిదాల అనంతరం జూన్ 12 రిలీజ్ కాబోతుంది. అయితే VFX వర్క్స్ ఇంకా అవ్వలేదని అందుకే మరోసారి సినిమా వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ పవన్ వ్యతిరేకులు, కొంతమంది హరిహర వీరమల్లు సినిమాకి బిజినెస్ అవ్వట్లేదని, సినిమా కొనడానికి ఎవరూ రావట్లేదని ప్రచారం చేస్తున్నారు. తాజాగా దీనిపై మూవీ యూనిట్ తీవ్రంగా ఖండించింది.
మూవీ యూనిట్ హరిహర వీరమల్లు బిజినెస్ పై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకి బయ్యర్లు దొరకట్లేదని వార్తలు రావడమేంటి? దానిని నిజమని కొందరు నమ్మడమేంటి? అంతకంటే కామెడీ ఇంకేమైనా ఉంటుందా? తెలుగునాట పవన్ కళ్యాణ్ అంటే ఒక బ్రాండ్. ఆయన సినిమా విడుదల అంటే తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణమే. అలాంటిది పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’కి బయ్యర్లు దొరకట్లేదంటే అసలు నమ్మశక్యంగా ఉందా? ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థ ప్రయోజనాలు దాగున్నాయో అన్నట్టుగా హరిహర వీరమల్లు గురించి ఇలా తప్పుడు ప్రచారం చేయడం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో ఆ భగవంతుడికే తెలియాలి.
Also Read : Yogi Adityanath : యూపీ సీఎం ‘యోగి ఆదిత్యనాథ్’ పై బయోపిక్ రిలీజ్ ఎప్పుడంటే..
పవన్ కళ్యాణ్ మొదటిసారి నటించిన పాన్ ఇండియా మూవీ ‘హరి హర వీరమల్లు’. పైగా ఆయన చారిత్రక యోధుడిగా నటించిన తొలి చిత్రం. మునుపెన్నడూ చూడని విధంగా సరికొత్తగా కనిపిస్తున్నారు. అద్భుతమైన సెట్లు, గ్రాఫిక్స్ తో ఎక్కడా రాజీ పడకుండా మెగా సూర్య ప్రొడక్షన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. 2020 ద్వితీయార్థంలో మొదలై, 2022 జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా పలు కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. వీరమల్లు ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో అనే మూడు సినిమాలు వచ్చాయంటే ఈ సినిమా ఎంత ఆలస్యమైందో అర్థం చేసుకోవచ్చు. ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం ఈ చిత్రానిది. అసలే భారీ బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్. దానికి తోడు షూటింగ్ ఆలస్యమైంది. దాంతో సహజంగానే బడ్జెట్ పెరిగిపోయింది.
మామూలుగానే పవన్ కళ్యాణ్ సినిమాలు తెలుగునాట భారీ బిజినెస్ చేస్తుంటాయి. అలాంటిది ఆయన కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రమిది. మరి ఈ సినిమా, ఏ స్థాయి బిజినెస్ చేయాలి. దానిని దృష్టిలో పెట్టుకునే నిర్మాతలు గత చిత్రాలకు మించి అధిక ధరలు చెప్తున్నారు. పలువురు బయ్యర్లు ఈ భారీ సినిమా హక్కులను సొంతం చేసుకోవడానికి ఆసక్తి చూపుతూ నిర్మాతలతో చర్చలు కూడా జరుపుతున్నారు. ఒక రూపాయి అటో ఇటో తమ సినిమాకి పెట్టిన ఖర్చుకి తగ్గట్టుగా నిర్మాతలు సినిమా హక్కులను అమ్మేస్తారు. ఇది ప్రతి సినిమాకి జరిగే వ్యవహారమే. హరిహర వీరమల్లుకి బయ్యర్లు లేరు అనేది అవాస్తవం. చాలా మంది బయ్యర్లు సిద్ధంగా ఉన్నారు, సరైన డీల్స్ కోసం నిర్మాతలు చర్చలు జరుపుతున్నారనేది వాస్తవం. కానీ కొందరు మాత్రం ఈ సినిమాకు బయ్యర్లు లేరంటూ పని గట్టుకొని ప్రచారం చేస్తున్నారు..
Also Read : Balakrishna : ‘మ్యాన్షన్ హౌస్ వేసినోడు మహానుభావుడు..’ బాలయ్య రీ రిలీజ్ సినిమా కోసం స్పెషల్ సాంగ్.. విన్నారా?
కొన్ని చిత్రాలు తెలుగు సినిమా స్థాయిని పెంచేలా ఉంటాయి. బాహుబలి చిత్రం రెండు భాగాలకు కలిపి నాలుగైదేళ్లు పట్టింది. ఆ చిత్రం తెలుగు సినిమాని ఏ స్థాయికి తీసుకెళ్లిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హరిహర వీరమల్లు కూడా అలాంటి చిత్రమే. కొన్ని కారణాల వల్ల ఒక్క భాగానికే ఐదేళ్లు పట్టి ఉండొచ్చు. కానీ తెలుగులో అత్యంత అరుదుగా వచ్చే చారిత్రాత్మక చిత్రమిది. ఇలాంటి చిత్రాలను భుజానికెత్తుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. వీరమల్లు లాంటి సినిమాలను ఆదరిస్తే తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుంది, ఇలాంటి గొప్ప సినిమాలు మరిన్ని వస్తాయి.
బయ్యర్లు లేరు, బజ్ లేదు, ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టాయి అంటూ.. హరిహర వీరమల్లు స్థాయిని, పవన్ కళ్యాణ్ స్థాయిని తగ్గించి చూపే ప్రయత్నం చేస్తూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తెలిసో తెలియక మీడియా, సోషల్ మీడియాలో కొందరు ఆ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
Also Read : Manchu Vishnu : ఇలా కూడా సేవ్ చేసుకుంటారా? అసలు పేర్లే లేకుండా.. ఇది మంచు విష్ణు స్టైల్..
సినిమా అనేది ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. దాని వెనుక వందల కోట్ల ఖర్చు, వందలాది మంది కష్టం ఉంటుంది. ఒక్క సినిమా మీద వేలాది మంది ఆధారపడి ఉంటారు. ఇవన్నీ పట్టించుకోకుండా ఎవరో ఏదో చెప్పారని గుడ్డిగా ప్రచారం చేసేయకూడదు. పవన్ కళ్యాణ్ లాంటి తిరుగులేని అగ్ర కథానాయకుడి సినిమాకి బయ్యర్లు లేరంటే ఆలోచించకుండా తప్పుడు ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్ళకూడదు.
నిజానికి ‘హరిహర వీరమల్లు’ సినిమాకి పవన్ కళ్యాణ్ గత చిత్రాలను మించిన బజ్ ఉంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా హక్కుల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆలస్యంగా వచ్చినా అందరికీ సరైన సమాధానం చెప్పే సినిమా ‘హరిహర వీరమల్లు’. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఒక గొప్ప సినిమా స్థాయిని తగ్గించే ప్రయత్నం చేయకూడదు అంటూ మీడియా ప్రకటనలో తెలిపారు.