Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ రేంజ్ పెరిగిందా? మృణాల్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా?

ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన మృణాల్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దీంతో ప్రస్తుతం మృణాల్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

Mrunal Thakur : మృణాల్ ఠాకూర్ రేంజ్ పెరిగిందా? మృణాల్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటుందో తెలుసా?

Mrunal Thakur taking Huge Remuneration for Movies

Updated On : July 9, 2023 / 11:44 AM IST

Mrunal Thakur :  ఎప్పుడో 2012 లో బాలీవుడ్ లో సీరియల్స్ తో కెరీర్ మొదలుపెట్టిన మృణాల్ ఠాకూర్ సీరియల్స్, సినిమాల్లో క్యారెక్టర్స్ చేసుకుంటూ బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదిగింది. వాటన్నిటితో రాని గుర్తింపు తెలుగులో చేసిన సీతారామం సినిమాతో ఒక్కసారిగా దేశమంతా పాపులర్ అయింది మృణాల్ ఠాకూర్. ఈ సినిమాతో మృణాల్ కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఈ సినిమాలో ఎంతో పద్దతిగల అమ్మాయిలా నటించి అందర్నీ మెప్పించింది. ఇక ఆ సినిమా తర్వాత తన బోల్డ్ ఫోటోషూట్స్ తో మరింత పాపులర్ అయి ఫాలోయింగ్ పెంచుకుంది మృణాల్.

ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ చాలా బిజీగా ఉంది. ఓ పక్క క్యూట్ క్యారెక్టర్స్ చేస్తూనే మరోపక్క బాలీవుడ్ లో బోల్డ్ క్యారెక్టర్స్ కి ఓకే చెప్తుండటంతో టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన మృణాల్ ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. దీంతో ప్రస్తుతం మృణాల్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

Mrunal Thakur taking Huge Remuneration for Movies
ఇటీవల మృణాల్ లస్ట్ స్టోరీస్ లో బోల్డ్ క్యారెక్టర్ తో మెప్పించింది. ఇక మృణాల్ చేతిలో నాని 30వ సినిమా, విజయ్ దేవరకొండ సినిమాతో పాటు మూడు బాలీవుడ్ సినిమాలు ఉన్నాయి. పలు సిరీస్ లకు కూడా త్వరలో ఓకే చెప్తుందని సమాచారం. బాలీవుడ్ లో ప్రస్తుతం మృణాల్ ఠాకూర్ మూడు నుంచి నాలుగు కోట్ల రెమ్యునరేషన్ ఒక్క సినిమాకు తీసుకుంటుందని సమాచారం. ఇక టాలీవుడ్ లో కూడా మృణాల్ కి మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఏర్పడటంతో ఇక్కడ కూడా దాదాపు 2 కోట్లు తీసుకుంటుందని సమాచారం.

Mahi V Raghav : డబ్బున్న ప్రతివాడు నన్ను బయోపిక్ తీయమని అడుగుతున్నాడు.. ఇకపై నేను బయోపిక్స్ తీయను..

ఒకప్పుడు ఛాన్సుల కోసం కష్టపడిన మృణాల్ ఒక్క సీతారామం సినిమాతో స్టార్ అయిపోయి ఇప్పుడు మరింత దూసుకుపోతూ ఇలా కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుండటంతో పలువురు అభినందిస్తున్నారు. కొంతమంది మాత్రం అమ్మో అంత రెమ్యునరేషనా? సినిమా హిట్ అవ్వగానే పెంచేసింది అని కామెంట్స్ చేస్తున్నారు.