Dhoni : విజయ్ సినిమాలో ధోని.. ?
భారత దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమ్ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు.

MS Dhoni-Thalapathy Vijay
Dhoni Movie Debut : భారత దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని (Mahendra Singh Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీమ్ఇండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. దేశానికి రెండు ప్రపంచకప్‌లు (2007 టీ20, 2011 వన్డే) లు అందించిన ఏకైక కెప్టెన్‌గా ఖ్యాతి గడించాడు. మూడు సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున (ఆగస్టు 15, 2020) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడుతున్నాడు.
ఇటీవలే ధోని, అతని భార్య సాక్షి(Sakshi) లు ధోని ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో సినీ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. ఎల్‌జీఎమ్ పేరుతో ఓ సినిమాని నిర్మించారు. మైదానంలో సిక్సర్లతో అలరించే మహేంద్రుడు వెండితెరపై నటుడిగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా..? అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఎల్‌జీఎమ్ సినిమా ప్రమోషన్స్ సమయంలో ధోని సతీమణి సాక్షిని ఈ విషయమై అడుగగా ఏమో మంచి కథతో పాటు అన్నీ కుదిరితే అది సాధ్యం కావొచ్చునని చెప్పింది.
Leo Movie : లియో నుంచి అర్జున్ ప్రోమో రిలీజ్.. రోలెక్స్ ఎంట్రీ రేంజ్‌లో హారొల్ద్ దాస్ ఎంట్రీ..
తాజాగా ధోని సినిమాల్లోకి వస్తున్నాడు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) హీరోగా తెరకెక్కుతోన్న సినిమాతో చిత్ర పరిశ్రమలోకి ధోని అడుగుపెడుతున్నాడనేది ఆ వార్త సారాంశం. వెంకట్ ప్రభు(Venkat Prabhu)) దర్శకత్వంలో తలపతి 68 వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న సినిమాలో కెప్టెన్ కూల్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు చెబుతున్నారు. ఈ వార్త విన్న సినీప్రియులతో పాటు క్రీడాభిమానులు తెగ సంతోషపడుతున్నారు. అయితే.. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఈ వార్త నిజం అయితే ధోని అభిమానులకు పండగే.
ఇదిలా ఉంటే.. విజయ్ నటించిన లియో విడుదలకు సిద్దంగా ఉంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో త్రిష, అర్జున్ సర్జా, సంజయ్ దత్, గౌతమ్ మీనన్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.