Bad Girlz : రేణుదేశాయ్ కీలక పాత్రలో ప్రదీప్ డైరెక్టర్ తో బ్యాడ్ గాళ్స్

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం బ్యాడ్ గాళ్స్,

Bad Girlz : రేణుదేశాయ్ కీలక పాత్రలో ప్రదీప్ డైరెక్టర్ తో బ్యాడ్ గాళ్స్

Munna Dhulipudi new movie is Bad Girlz

Updated On : August 6, 2025 / 6:04 PM IST

అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం బ్యాడ్ గాళ్స్. ‘కానీ చాలా మంచోళ్లు’ అనేది ట్యాగ్ లైన్. ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ ఫేమ్ డైరెక్టర్ మున్నా ధులిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. రేణూ దేశాయ్ కీలక పాత్రల పోషించారు. నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చంద్రబోస్ సాహిత్యం అందిస్తుండ‌గా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టైటిల్‌ మోషన్ పోస్టర్‌ను దర్శకులు చందూ మొండేటి, శివ నిర్వాణ, కృష్ణ చైతన్య లు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా నిర్మాత‌లు మాట్లాడుతూ.. ఈ చిత్రంలోని పాటలు, కథ అన్నీ చాలా బాగున్నాయన్నారు. ప్ర‌తి కుటుంబం కూడా ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేస్తుంద‌న్నారు.

GHAATI : అనుష్క శెట్టి ‘ఘాటి’ ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

ద‌ర్శ‌కుడు మున్నా మాట్లాడుతూ.. ఈ స్టోరీకి ఎంతోమంది అమ్మాయిల కథలు స్ఫూర్తినిచ్చాయి. అమ్మాయిలకు పెళ్లి ముందు ఉండే ఫ్రీడం పెళ్లి తర్వాత ఉండదు. అలాంటి చాలా మంది కథల స్ఫూర్తితో ఈ సినిమా తీశా. ఈ కథను ఐదారుగురు పెద్ద నిర్మాతలకు చెప్పాను. కొత్త అమ్మాయిలతో మార్కెట్ అవుతుందా అని అడిగారు. అందుకే నేను, నా క్లాస్‌మేట్స్ డబ్బులు పెట్టి ఈ సినిమా తీశాం. బాగా చదువుకున్నవాళ్ల కథ ఇది. అమ్మాయిలను పేరెంట్స్ భయంతో పెంచుతాం. అమ్మాయిలను భయంతో కాదు ధైర్యంతో పెంచాలి అని చెప్పే కథ ఇది. అని అన్నారు.