Naga Chaitanya : నా కళ్ళల్లో ఇంకా అదే తిరుగుతోంది

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో హాట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు.. నాగచైత్యన్య హాజరయ్యారు.

Naga Chaitanya : నా కళ్ళల్లో ఇంకా అదే తిరుగుతోంది

Naga Chaitanya

Updated On : October 8, 2021 / 11:16 PM IST

Naga Chaitanya : తొలి చిత్రం బొమ్మ‌రిల్లుతో బ్లాక్‌బ‌స్ట‌ర్ కొట్టి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న‌ ద‌ర్శ‌కుడు భాస్క‌ర్‌. ఆ తర్వాత పరుగు సినిమాతో మరో విజయం తనఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు అఖిల్, పూజా హెగ్డేల కాంబినేషన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాన్ని భాస్కర్ తెరకెక్కించారు. శుక్రవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో హాట్టహాసంగా జరిగింది.

Read More : Most Eligible Bachelor Trailer : ట్రైలర్ అదిరింది.. అఖిల్ హిట్ కొట్టేలా ఉన్నాడుగా..

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వచ్చిన నాగచైతన్య సినిమాకు సంబందించిన విశేషాలను తెలియచేశారు. అనంతరం అఖిల్ గురించి మాట్లాడుతూ అఖిల్ లో కష్టపడే తత్వం ఉందని తెలిపాడు. ఈ సినిమా అఖిల్ కెరియర్ ని టర్న్ చేస్తుందని అన్నారు. అఖిల్ ఫ్యూచర్ ప్లానింగ్ చాలా బాగుంటుందని..వచ్చే ఐదేలారేళ్లలో సినిమాలు ఎలా చెయ్యాలనే ప్లానింగ్ తో ముందుకు వెళ్తాడని తెలిపారు.

Read More : Chay Sam Breakup : ఆడవాళ్లనే ప్రశ్నిస్తారా?? మగాళ్లని ప్రశ్నించరా?? : సమంత

ఎలాంటి క్యారెక్టర్లు చేయాలి.. ఎలాంటి కథలను ఎంచుకోవాలనే మాస్టర్ ప్లాన్ అఖిల్ దగ్గర ఉందన్నారు చైతూ. అఖిల్ తనకు ఇంకా సిసింద్రీలో చిన్నపిల్లాడిలాగే కనిపిస్తున్నాడని, తన కళ్ళలో సిసింద్రీనే తిరుగుతున్నాడని అన్నారు. ప్రతి సంవత్సరం ఇంట్లో తానో కొత్త అఖిల్ ని చూస్తానని చైతు చెప్పుకొచ్చారు.