Naga Chaitanya : ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాగచైతన్య.. వారికోసం స్వయంగా నోరూరించే చేపల పులుసు.. వీడియో వైరల్
తండేల్ రాజు పాత్రలో నటిస్తున్న నాగ చైతన్య విశాఖపట్నంలో స్థానిక మత్స్యకారులతో కొంత సమాయాన్ని గడిపాడు.

Naga Chaitanya Keeps His Promise Cooks Fish Curry For Them
అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మూవీ తండేల్. చందు మొండేటి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాలను మొదలు పెట్టింది. ఇప్పటికే రెండు పాటలు.. ‘బుజ్జితల్లి కాస్త నవ్వవే’, ‘నమో నమో నమః శివాయ’ లను విడుదల చేసింది.
ఇదిలా ఉంటే.. తండేల్ రాజు పాత్రలో నటిస్తున్న నాగ చైతన్య విశాఖపట్నంలో స్థానిక మత్స్యకారులతో కొంత సమాయాన్ని గడిపాడు. షూటింగ్ ఆఖరి రోజు అతడు ఇచ్చిన మాట ప్రకారం చేపల పులుపు స్వయంగా వండాడు. అక్కడి స్థానికులతో పాటు చిత్రబృందానికి తన వంట రుచి చూపించాడు. ఈ విషయాన్ని చిత్ర బృందం ఓ వీడియో ద్వారా తెలియజేసింది.
“యేటలో చేపలు పట్టేసాక.. మంచి పులుసు ఎట్టేయాలి కదా.. తండేల్ రాజా ఆకా యువ సామ్రాట్ నాగ చైతన్య తండేల్ షూటింగ్‌లో స్థానికుల కోసం నోరూరించే చేపల పులుసు వండారు.” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
చైతు చేసిన చేపల కూర ఎంతో రుచికరంగా ఉందని స్థానిక మత్స్యకారులు చెప్పారు. తండేల్ మూవీ విజయం సాధించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తండేల్ మూవీ శ్రీకాకుళానికి చెందిన పలువురు మత్స్యకారుల జీవిత కథతో తెరకెక్కిస్తున్నారు. సముద్రంలో వేటకు వెళ్లి పొరబాటున పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి ప్రభుత్వానికి చిక్కిన తరువాత ఏం జరిగింది? ఎలా బయటపడ్డారు అనే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.