Naga Chaitanya : ఆ విషయంలో మాత్రం కొన్ని సార్లు బాధపడ్డాను..

ప్రస్తుతం కస్టడీ ప్రమోషన్స్ లో ఉన్న నాగచైతన్య తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆ విషయంలో మాత్రం కొన్ని సార్లు బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు.

Naga Chaitanya : ఆ విషయంలో మాత్రం కొన్ని సార్లు బాధపడ్డాను..

Naga Chaitanya shares his biggest regret at custody promotions

Updated On : May 1, 2023 / 9:57 PM IST

Naga Chaitanya : అక్కినేని యువసామ్రాట్ నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం కస్టడీ (Custody). తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో బై లింగువల్ గా తెరకెక్కింది. పోలీస్ కథాంశంతో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ ని చైతన్య దగ్గర ఉండి చేస్తున్నాడు. తెలుగు, తమిళ రాష్ట్రాల్లో సందడి చేస్తున్న నాగచైతన్య.. తాజాగా ఒక తమిళ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూలో.. ‘మీ జీవితంలో మీరు పశ్చాత్తాపపడ్డ లేదా విచారకరమైన సంఘటనలు ఉన్నాయా’ అని ప్రశ్నించారు.

Agent : ఏజెంట్ విషయంలో తప్పంతా మాదే.. చిరంజీవి సినిమాలో అది జరగదు.. నిర్మాత ట్వీట్!

ఆ ప్రశ్నకు చైతన్య బదులిస్తూ.. “ఇప్పటి వరకు నా లైఫ్‌ లో అటువంటి సంఘటనలు ఏమి లేవు. ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే ప్రతిదాన్ని ఒక పాఠంలా భావిస్తాను. వాటి నుంచి ప్రతిదీ నేర్చుకుంటూ ముందుకు వెళ్లడమే లైఫ్. మూవీ విషయంలో మాత్రం కొన్ని సార్లు బాధ పడ్డాను. కొన్ని సినిమాల విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేక పోయానని పశ్చాత్తాప పడ్డాను. మూడు చిత్రాల విషయంలో అలా జరిగింది” అంటూ చెప్పుకొచ్చాడు.

Agent : అఖిల్ కాదు మమ్ముట్టి హీరో.. రామ్ చరణ్ పాత్ర ఏంటి?

ఇక కస్టడీ సినిమా విషయానికి వస్తే.. బంగార్రాజు సినిమాలో నాగచైతన్యకి జోడిగా నటించి సక్సెస్ పెయిర్ అనిపించుకున్న కృతిశెట్టి (Krithi Shetty) మరోసారి ఈ సినిమాలో హీరోయిన్ గా కనిపిస్తుంది. అరవింద్ స్వామి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. మాస్ట్రో ఇళయరాజా అండ్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. మే 12న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.