Naa Saami Ranga : ‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్ రిలీజ్.. మూమూలుగా ఉండదు..
నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘నా సామిరంగ’ టైటిల్ సాంగ్ రిలీజ్.

Nagarjuna Akkineni Allari Naresh Naa Saami Ranga title song release
Naa Saami Ranga : నాగార్జున ఈ సంక్రాంతికి ‘నా సామిరంగ’ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో మరో ఇద్దరు హీరోలు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హీరోయిన్స్ గా ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్ నటిస్తున్నారు. మలయాళ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని డ్యాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్నారు.
కాగా ఈ సినిమా నుంచి సాంగ్స్, గ్లింప్స్, టీజర్ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా సినిమా నుంచి టైటిల్ సాంగ్ ‘నా సామిరంగ’ని విడుదల చేశారు. ఆస్కార్ విన్నర్స్ ఎం ఎం కీరవాణి, చంద్రబోస్ ఈ పాటకి సంగీతం, లిరిక్స్ అందించారు. అలాగే ఆస్కార్ వేదిక వరకు వెళ్లిన తెలుగు సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్.. పాటని పాడారు. మరి ఆ పాట వైపు ఓ లుక్ వేసేయండి.
Also read : Sivaji : బిగ్‌బాస్‌లో శివాజీ పర్ఫార్మెన్స్ చూసి మెగాస్టార్ ఏమన్నారంటే..? బయటపెట్టిన శివాజీ..