Nagarjuna : రాజమౌళితో నాగార్జున సినిమా.. నాగార్జున ఏమన్నాడంటే..?

నాగార్జున మాట్లాడుతూ.. ''రాజమౌళితో సినిమా చేసే సమయం వస్తే అది సాధ్యమవుతుంది. నాతో సినిమా తీయమని రాజమౌళిని అప్పుడప్పుడు అడుగుతుంటూనే ఉంటాను. కానీ ప్రతిసారీ ఆయన.............

Nagarjuna : రాజమౌళితో నాగార్జున సినిమా.. నాగార్జున ఏమన్నాడంటే..?

Nagarjuna spoke about movie with rajamouli

Updated On : September 19, 2022 / 1:05 PM IST

Nagarjuna :  బాహుబలి, RRR సినిమాలతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా పెంచి తెలుగు సినిమాకి ఓ గుర్తింపు తీసుకొచ్చారు రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి మహేష్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఆయనతో ప్రతి హీరో, హీరోయిన్, నటులు సినిమా చేయాలని అనుకుంటారు. తాజాగా కింగ్ నాగార్జున కూడా రాజమౌళితో సినిమా గురించి మాట్లాడాడు.

నాగార్జున ఈ దసరాకి ఘోస్ట్ సినిమాతో రాబోతున్నాడు. ఇటీవలే బ్రహ్మాస్త్ర సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో బాలీవుడ్ లో సక్సెస్ మీట్స్ నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ సక్సెస్ మీట్ లో నాగార్జునని రాజమౌళితో సినిమా ఎప్పుడు చేస్తారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

Gautham Vasudev Menon : ఏ మాయ చేసావే కథ మొదట మహేష్‌కి చెప్పాను.. కానీ..

దీనికి నాగార్జున మాట్లాడుతూ.. ”రాజమౌళితో సినిమా చేసే సమయం వస్తే అది సాధ్యమవుతుంది. నాతో సినిమా తీయమని రాజమౌళిని అప్పుడప్పుడు అడుగుతుంటూనే ఉంటాను. కానీ ప్రతిసారీ ఆయన చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటారు. రాజమౌళి కథని నమ్మే దర్శకుడు. స్క్రిప్ట్ పని పూర్తయ్యాక దానికి తగ్గ నటుల్ని వెతుక్కుంటారు. మరి ఆయన కథలకి నేనెప్పుడూ సరిపోతానో, ఆ సమయం వచ్చేదాకా ఎదురుచూడాల్సిందే” అని చెప్పారు. ఇండైరెక్ట్ గా రాజమౌళి ఓకే అంటే సినిమా చేయడానికి నాగార్జున రెడీగా ఉన్నాడని చెప్పేశారు. అవసరమైతే తానే నిర్మాతగా కూడా ఉంటారని తెలుస్తుంది.