Nandamuri Balakrishna : ఇది దైవ నిర్ణయంగా భావిస్తున్నాను.. ఎన్టీఆర్ జాతీయ అవార్డుపై బాల‌య్య‌..

Nandamuri Balakrishna : ఇది దైవ నిర్ణయంగా భావిస్తున్నాను.. ఎన్టీఆర్ జాతీయ అవార్డుపై బాల‌య్య‌..

Actor Balakrishna response about Padma Bhushan honour

Updated On : May 30, 2025 / 3:12 PM IST

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన గ‌ద్ద‌ర్ అవార్డుల‌పై నంద‌మూరి బాల‌కృష్ణ స్పందించారు. త‌న‌కు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్ర‌క‌టించ‌డాన్ని అదృష్టంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. ఇది దైవ నిర్ణ‌యంగా, త‌న తండ్రి ఎన్టీఆర్ ఆశీర్వాదంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు.

‘ఎన్టీఆర్ శ‌తజ‌యంతి ఉత్స‌వాలు పూర్తిచేసుకున్న అద్భుత‌మైన ఘ‌డియ‌లు ఒక వైపు.. ఎన్టీఆర్ నట ప్రస్థాన 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు..

నటుడిగా నేను 50 ఏళ్ళ స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మ భూషణ్ తో సత్కరించిన ఇలాంటి త‌రుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం నుండి “ఎన్టీఆర్ జాతీయ అవార్డు”ని నాకు ప్ర‌క‌టించ‌డం నా అదృష్టంగా, దైవ నిర్ణ‌యంగా, నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. ఇంత‌టి ప్ర‌తిష్టాత్మ‌క‌మైన పుర‌స్కారానికి న‌న్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్ర‌భుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, జ్యూరీ స‌భ్యుల‌కు నా కృత‌జ్ఞ‌త‌లు తెలియజేస్తున్నాను.

Gaddar Awards : గ‌ద్ద‌ర్ అవార్డులు.. 2014 నుంచి 2023 వరకు బెస్ట్ మూవీస్‌ ఇవే..

ప్ర‌పంచం న‌లుమూల‌లా ఉన్న తెలుగు ప్ర‌జ‌ల దీవెన‌లు, నాన్న గారి చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్ల‌వేళలా ఇలానే ఉండాల‌ని కోరుకుంటున్నాను.’ అని నంద‌మూరి బాల‌కృష్ణ తెలిపారు.