Nandamuri Mohana Krishna : చంద్రబాబుకు భారీ విరాళం అందించిన బాలకృష్ణ సోదరుడు.. వరదల బాధితుల సాయం కోసం..
తాజాగా బాలకృష్ణ సోదరుడు, సీనియర్ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణ ఏపీ వరద బాధితుల కోసం విరాళం ఇచ్చారు.

Nandamuri Mohana Krishna Huge Donation to AP Flood Effected People
Nandamuri Mohana Krishna : ఇటీవల ఏపీ, తెలంగాణలో వచ్చిన వర్షాలకు వరదలు ఏర్పడి కొన్ని ప్రాంతాలు నీట మునిగిన సంగతి తెలిసిందే. వరద బాధితులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. వరద బాధితుల కోసం రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు ఇప్పటికే అనేక మంది సినీ సెలబ్రిటీలు భారీ విరాళాలు అందచేశారు. ఈ క్రమంలో తాజాగా బాలకృష్ణ సోదరుడు, సీనియర్ సినిమాటోగ్రాఫర్ నందమూరి మోహన కృష్ణ ఏపీ వరద బాధితుల కోసం విరాళం ఇచ్చారు.
నందమూరి మోహన కృష్ణ, ఆయన కుమార్తె నందమూరి మోహన రూప తమ వంతు సహాయంగా వరద బాధితుల కోసం ఏపీ రాష్ట్రానికి 25 లక్షలు విరాళంగా ఇచ్చారు. నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసి 25 లక్షల రూపాయల చెక్కును అందచేశారు. గతంలో కూడా నందమూరి మోహన్ కృష్ణ, మోహన్ రూప పలు సమయాల్లో విరాళాలు అందచేశారు.
Also Read : Ashok Galla : సైలెంట్‌గా మహేష్ బాబు అల్లుడి నెక్స్ట్ సినిమా మొదలు.. క్లాప్ కొట్టిన నమ్రత..
నందమూరి మోహన్ రూప గత ఎన్నికలలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక నందమూరి మోహన కృష్ణ గతంలో ఎన్నో సినిమాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసారు. అలాగే నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా కూడా వ్యవహరించారు.