TFCC Nandi Awatds : TFCC నంది అవార్డులు.. తెలంగాణ ప్రభుత్వం సహకారంతో.. దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా..
తెలంగాణ తరపున నంది అవార్డులు ఇస్తామంటూ తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ముందుకొచ్చింది. కొన్ని రోజుల క్రితమే తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ TFCC నంది అవార్డ్స్ 2023 తెలంగాణ ప్రభుత్వం తరపునే ఇస్తున్నామని ప్రకటించారు. తాజాగా దీనిపై ప్రెస్ మీట్ నిర్వహించారు.

Nandi awards by Telangana film Chamber of Commerce event in dubai
Nandi Awards 2023 : తెలుగు సినీ రంగంలో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక ‘నంది అవార్డులు’(Nandi Awards) గతకొంత కాలంగా నిలిచిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలు వేరు పడ్డాక, ఈ అవార్డులను పట్టించుకునే వారు కరువయ్యారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇటు తెలంగాణలో(Telangana) కానీ, అటు ఆంధ్రాలో(Andhra Pradesh) కానీ నంది అవార్డుల ఊసే లేదని పలువురు మండిపడుతున్నారు. పలువురు సినీ పెద్దలు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కలిసి నంది అవార్డులు ఇమ్మని అడిగినా ఉపయోగం లేకుండా పోయింది. గత కొంతకాలంగా ఈ నంది అవార్డుల రచ్చ మరింత జోరుగా సాగుతుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ తరపున నంది అవార్డులు ఇస్తామంటూ తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ముందుకొచ్చింది. కొన్ని రోజుల క్రితమే తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ TFCC నంది అవార్డ్స్ 2023 తెలంగాణ ప్రభుత్వం తరపునే ఇస్తున్నామని ప్రకటించారు. తాజాగా దీనిపై ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో TFCC చైర్మ రామకృష్ణ గౌడ్ తో పాటు, డైరెక్టర్ B గోపాల్, మురళీమోహన్, సుమన్, శివాజీ రాజా, రోజా రమణి.. పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ ప్రెస్ మీట్ లో TFCC చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సహకారంతో నంది అవార్డులు ఇచ్చేందుకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాము. రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారంతో దుబాయ్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో TFCC నంది అవార్డ్స్ వేడుక ఆగస్టు 12న నిర్వహించబోతున్నాము. దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా ఈ అవార్డ్స్ అందించనున్నాము. అవార్డుల ఎంపికకు 13 మంది జ్యూరీ సభ్యులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేశాము. 2021, 2022 సంవత్సరాలలో రిలీజయిన సినిమాలకు ఈ అవార్డులు అందించనున్నాము. జూన్ 15 లోపు పలు విభాగాల్లో తమ సినిమాలను TFCC వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు.
అలాగే దుబాయిలో జరిగే ఈ అవార్డు వేడుకలకు తెలంగాణ సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, టూరిజం మినిష్టర్ శ్రీనివాస్ గౌడ్, ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గోపాలకృష్ణతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రానున్నారు అని తెలిపారు. పలు విభాగాల్లో ఉత్తమ కేటగిరీలతో పాటు, సీనియర్ నటుల పేరు మీద స్మారక అవార్డులు కూడా అందచేయనున్నారు. ఈ నంది అవార్డు వేడుకలు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరగనున్నాయి.