Nandita Swetha : ఆ వ్యాధితో బాధపడుతున్నా.. వ్యాయామాలు చేయలేను.. కానీ ఈ సినిమా కోసం.. హీరోయిన్ ఎమోషనల్..

హీరోయిన్ నందిత శ్వేత ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. అలాగే తాను ఓ వ్యాధితో బాధపడుతున్నట్టు కూడా తెలిపింది నందిత.

Nandita Swetha : ఆ వ్యాధితో బాధపడుతున్నా.. వ్యాయామాలు చేయలేను.. కానీ ఈ సినిమా కోసం.. హీరోయిన్ ఎమోషనల్..

Nandita Swetha effected with Fibromyalgia disorder

Updated On : July 16, 2023 / 3:34 PM IST

Nandita Swetha :  కన్నడ భామ నందిత శ్వేత వరుస తమిళ సినిమాలు చేసింది. తెలుగులో ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉంది నందిత శ్వేత. నందిత త్వరలో హిడింబ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు(Ashwin Babu) హీరోగా, నందిత శ్వేత హీరోయిన్ గా అనిల్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హిడింబ(Hidimba).

సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో హిడింబ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజయిన ట్రైలర్ తో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. జులై 20న ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ నందిత శ్వేత ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. అలాగే తాను ఓ వ్యాధితో బాధపడుతున్నట్టు కూడా తెలిపింది నందిత.

Thaman : ఒరిజినల్ సినిమాలో అసలు పాటలే లేవు.. కానీ ‘బ్రో’ సినిమాలో.. బ్రో పాటలకు తమన్‌పై పవన్ ఫ్యాన్స్ ఫైర్..

నందిత శ్వేత మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం నేను బరువు తగ్గాల్సి వచ్చింది. ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాను. ఇందుకు చాలా కష్టపడ్డాను. నేను ఫైబ్రోమైయాల్జియా అనే కండరాల రుగ్మతతో బాధపడుతున్నాను. దాని వల్ల ఎక్కువ డైట్ పాటిస్తాను. భారీ వ్యాయామాలు చేయలేను. కానీ ఈ సినిమా కోసం వ్యాయామాలు చేయాల్సి వచ్చింది. నిద్ర లేకుండా పని చేయాల్సి వచ్చింది. ఒత్తిడి, నిద్ర లేకపోవడం వల్ల ఈ సమస్య మరింత ఎక్కువవుతుంది. కానీ సినిమా కోసం ఇవన్నీ భరించి బరువు తగ్గి చేశాను అని తెలుపుతూ ఎమోషనల్ అయింది.