Nani: అంటే సుందరానికీ.. అంత అవసరమా..?
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘అంటే.. సుందరానికీ’’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండగా....
Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘‘అంటే.. సుందరానికీ’’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రం ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రానుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆతృతగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని సుందరం అనే పాత్రలో కామెడీని పండించే విధానం ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
Nani: అంటే.. సుందరానికీ.. అక్కడ వదులుతారట!
ఈ సినిమాలో నాని సరసన అందాల భామ నజ్రియా నటిస్తుండటంతో వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రేక్షకులు ఖచ్చితంగా ఫాలో అవుతూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ సమయంలోనే ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా తెలుస్తోంది.
Ante Sundaraniki: అంటే సుందరానికీ.. పక్కా కామెడీ గురూ!
అంటే.. సుందరానికీ చిత్రాన్ని అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా చిత్ర యూనిట్ రూపొందించడంతో, ఈ సినిమాకు రెగ్యులర్ సినిమాలకంటే లెంగ్తీ రన్ టైమ్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ఏకంగా మూడు గంటల రన్ టైమ్‌ను చిత్ర యూనిట్ లాక్ చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్‌గా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసే వరకు వెయిట్ చేయాల్సిందే.