Dasara Collections : నాని దూకుడు మాములుగా లేదు.. 4 రోజుల్లో దసరా కలెక్షన్స్?

నాని (Nani) నటించిన 'దసరా' (Dasara) సినిమా కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. మొదటి వీకెండ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం.. ఆల్మోస్ట్ బడ్జెట్ మొత్తాన్ని రికవరీ చేసేసింది.

Dasara Collections : నాని దూకుడు మాములుగా లేదు.. 4 రోజుల్లో దసరా కలెక్షన్స్?

Nani Dasara collections - Pic Source Twitter

Updated On : April 3, 2023 / 1:16 PM IST

Dasara Collections : నేచురల్ స్టార్ నాని (Nani) మొదటిసారి ఒక కంప్లీట్ రగ్గడ్ లుక్ లో కనిపిస్తూ చేసిన చిత్రం ‘దసరా’ (Dasara). పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాని కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేశాడు. ‘నేను లోకల్’ మూవీ తరువాత కీర్తి సురేష్ (Keerthy Suresh) మరోసారి నాని సరసన నటించింది. శ్రీరామనవమి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్టు టాక్ తో దూసుకు పోతుంది. మొదటి రోజే ఏకంగా 38 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి నాని కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది.

Nani Dasara : అమెరికాలో నాని సరికొత్త రికార్డ్.. మహేష్ తర్వాత నాని ఒక్కడే..

ఇక రెండో రోజు 53 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని, మూడో రోజు 71 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుంటూ దూసుకుపోతుంది. ఆదివారంతో (ఏప్రిల్ 2) మొదటి వీకెండ్ పూర్తీ చేసుకున్న ఈ చిత్రం.. 4 రోజులకు గాను 87 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని అందుకొని 100 కోట్ల మార్క్ వైపు పరుగులు పెడుతుంది. నాని వేగం చూస్తుంటే 100 కోట్ల క్లబ్ లోకి అడుగు పెట్టడానికి పెద్ద సమయం పట్టేలా లేదు. ఇక ఈరోజు కలెక్షన్స్ తో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కూడా సాదించేస్తుంది. ఇప్పటివరకు ఈ మూవీ 45 ప్లస్ షేర్ సాధించింది.

Dasara Collections: యూఎస్ బాక్సాఫీస్ వద్ద ధరణిగాడి ఊచకోత..!

బ్రేక్ ఈవెన్ సాధించడానికి 47 కోట్ల పై కలెక్షన్స్ రాబడితే సరిపోతుంది. దీంతో ఈరోజు వచ్చే కలెక్షన్స్ తో దసరా లాభాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకి ప్రేక్షకులు మాత్రమే కాదు, టాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా అయ్యిపోతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఈ సినిమాని అభినందిస్తూ స్పెషల్ పోస్ట్ లు వేశారు. దీంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ పెరిగిపోయింది. మరి టోటల్ రన్ లో ఈ సినిమా ఎన్ని వండర్స్ సాధిస్తుందో చూడాలి.