Dasara : నాని సినిమాల లిస్ట్ లో దసరా సీక్వెల్ కూడా ఉందా?
నాని రాబోయే లిస్ట్ లో దసరా సీక్వెల్ కూడా ఉందని సమాచారం.

Nani Srikanth Odela Movie Dasara Having Sequel Rumors goes Viral
Dasara Movie : న్యాచురల్ స్టార్ నాని(Nani) ఇటీవల వరుస హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. గత సంవత్సరం దసరా, హాయ్ నాన్న సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు డిఫరెంట్ జానర్స్ తో హిట్స్ కొట్టాడు. ఇక నాని చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయని సమాచారం. అయితే నాని రాబోయే లిస్ట్ లో దసరా సీక్వెల్ కూడా ఉందని సమాచారం.
గత సంవత్సరం మార్చిలో ‘దసరా’ సినిమా రిలిజ్ అయింది. నాని, కీర్తిసురేష్, దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్స్ గా ఫుల్ మాస్ రస్టిక్ సినిమాగా దసరా తెరకెక్కింది. కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మొదటిసారి నాని ఈ రేంజ్ మాస్ సినిమా తీయడం. నాని ఈ రేంజ్ లో మాస్ చూపిస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. ఇక సినిమా కథ కొత్తగా ఉండటం, యాక్షన్ సీన్స్ అదిరిపోవడంతో దసరా భారీ హిట్ కొట్టింది. దసరా సినిమా ఏకంగా 120 కోట్లు కలెక్ట్ చేసింది.
సినిమా చివర్లో సీక్వెల్ అనౌన్స్ చేయకపోయినా కథ ఇంకా ఏదో ఉంది అన్నట్టే వదిలేశారు. తాజాగా దసరా సినిమా సీక్వెల్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఇంకో సినిమా ఉంటుందని నాని గతంలోనే తెలిపాడు. అది దసరా సీక్వెల్ అవ్వొచ్చని సమాచారం.
Also Read : Manjummel Boys : మలయాళం బ్లాక్ బస్టర్ ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగు రిలీజ్.. ఎప్పుడో తెలుసా?
దసరా సినిమా చివర్లో ఏడేళ్ల జైలు శిక్ష తర్వాత ధరణి, అతని ఫ్రెండ్స్ ఊళ్లోకి వస్తే ఇంకా తాగుడు వల్ల ఆ ఊరి ప్రజలు నాశనమైపోతున్నారని తెలిసి ఆ ఊరికి ఉన్న ఒక్క బార్ ని తగలబెడతాడు. దీంతో తర్వాత ఏం జరిగింది, కీర్తి సురేష్ తో పెళ్లి ప్రయాణం ఎలా ముందుకి సాగింది అనే కథతో సీక్వెల్ ఉంటుందా? లేక ఇంకేదైనా కొత్త పాయింట్ తీసుకొస్తాడా చూడాలి. మొత్తానికి నాని కెరీర్ లోనే పక్కా మాస్ సినిమా అయిన దసరాకి సీక్వెల్ ఉందని వార్తలు రావడంతో అభిమానులు ఇది నిజమైతే బాగుండు అని అంటున్నారు. మరి దీనిపై అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.