Nara Lokesh : చిరంజీవి, బాలయ్యపై లోకేష్ వ్యాఖ్యలు.. చిరుకి అభిమానినే కాని..

ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో యువతతో ‘హలో లోకేశ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు లోకేశ్....................

Nara Lokesh : చిరంజీవి, బాలయ్యపై లోకేష్ వ్యాఖ్యలు.. చిరుకి అభిమానినే కాని..

Lokesh

Updated On : February 25, 2023 / 10:12 AM IST

Nara Lokesh :  టీడీపీ యువ నేత, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ప్రస్తుతం యువగళం పాదయాత్ర చేస్తున్నాడు. ఈ యాత్రలో భాగంగా వివిధ వర్గాలతో భేటీ అవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ సూచనలు, సలహాలు అందుకుంటూ ముందుకు సాగుతున్నారు లోకేశ్. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తిరుపతిలో యువతతో ‘హలో లోకేశ్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు లోకేశ్.

ఈ క్రమంలో అక్కడికి వచ్చిన యువత రాజకీయాలు కాకుండా సరదా ప్రశ్నలు అడగాగా లోకేశ్ కూడా సరదాగా సమాధానాలు ఇచ్చాడు. లోకేశ్ ని మీరు ఎవరి ఫ్యాన్ అని ఒకరు అడగగా.. నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్ అని, ఇటీవలే వాల్తేరు వీరయ్య సినిమా కూడా చూశాను, సినిమా బాగుంది అని చెప్పాడు. అలాగే బాలయ్య ఎంతైనా మా ముద్దుల మామయ్యా. ఆయనను కూడా అభిమానిస్తాను. ఆయన కొత్త సినిమా రిలీజయితే కూడా మొదటి రోజే చూస్తాను అని అన్నారు. దీంతో లోకేశ్ మెగాస్టార్ ఫ్యాన్ అని చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Das Ka Dhamki : హమ్మయ్య.. ధమ్కీ షూట్ అయింది.. వాయిదాల మీద వాయిదాలు.. విశ్వక్ ఎప్పుడు రిలీజ్ చేస్తాడో..

అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా అడగగా.. రాజకీయాల్లోకి రావాలంటే మంచి మనసు ఉండాలి. అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర 2014 లోనే చూశాను అని అన్నారు.