Narendra Modi : ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులతో మోదీ.. అందులో నటించిన మావటిలకు ప్రధాని ప్రత్యేక అభినందనలు..
తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ బందిపూర్ టైగర్ రిజర్వ్, మూడుమలై టైగర్ రిజర్వ్ లను సందర్శించారు. ఈ నేపథ్యంలో మూడుమలై టైగర్ రిజర్వ్‌లో ఉన్న ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులను కూడా సందర్శించారు.

Narendra Modi visits The Elephant Whisperers movie Elephants
Narendra Modi : ఇటీవల ఆస్కార్ (Oscar) వేడుకల్లో మన ఇండియా(India) నుంచి నాటు నాటు(Naatu Naatu) సాంగ్ తో పాటు ది ఎలిఫెంట్ విష్పరర్స్(The Elephant Whisperers ) అనే సినిమా కూడా ఆస్కార్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం(Best Documentary Short Film) కేటగిరిలో ది ఎలిఫెంట్ విష్పరర్స్ సినిమా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. దీంతో అవార్డు అందుకున్న నిర్మాత గునీత్ మోంగా(Guneet Monga), డైరెక్టర్ కార్తీకి గొంజాల్వేస్(Kartiki Gonsalves)లను అందరూ అభినందిస్తున్నారు. వీరితో పాటు ఈ సినిమాలో నటించిన రియల్ ఏనుగులు, రియల్ ఏనుగు కాపరులు బొమ్మన్(Bomman), బెల్లి(Belli)లను కూడా అందరూ అభినందిస్తున్నారు.
మావటీలు బొమ్మన్, బెల్లిలను ఇప్పటికే తమిళనాడు ప్రభుత్వం తరపున తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సత్కరించి రివార్డుని కూడా అందించారు. ఆ ఏనుగులకు మరిన్ని సౌకర్యాలు ఏర్పాటుకు నిధులు విడుదల చేశారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ బందిపూర్ టైగర్ రిజర్వ్, మూడుమలై టైగర్ రిజర్వ్ లను సందర్శించారు. ఈ నేపథ్యంలో మూడుమలై టైగర్ రిజర్వ్‌లో ఉన్న ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులను కూడా సందర్శించారు.
మూడుమలై టైగర్ రిజర్వ్ లో ఉన్న ఎలిఫెంట్ విష్పరర్స్ ఏనుగులను సందర్శించి కాసేపు వాటితో ఆడుకున్నారు. వాటితో పాటు అక్కడ ఉన్న మరికొన్ని ఏనుగులతో కూడా మోదీ సరదాగా ఆడుకున్నారు. ఆ ఏనుగులని ప్రేమగా నిమిరారు. అలాగే అక్కడే ఉన్న ఎలిఫెంట్ విష్పరర్స్ లో నటించిన రియల్ ఏనుగు కాపరులు బొమ్మన్, బెల్లిలను కూడా కలిసి వారిని అభినందించారు మోదీ. ఆ ఏనుగులతో, వారితో దిగిన ఫోటోలను మోదీ తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. వారితో గడపడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఏనుగులతో మోదీ ఆడుకుంటున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
What a delight to meet the wonderful Bomman and Belli, along with Bommi and Raghu. pic.twitter.com/Jt75AslRfF
— Narendra Modi (@narendramodi) April 9, 2023