Month of Madhu : లవర్స్ కోసం ‘మంత్ ఆఫ్ మధు’ సీక్రెట్ స్క్రీనింగ్.. మీరుకూడా వెళ్తారా..?
'మంత్ ఆఫ్ మధు' చిత్ర యూనిట్ లవర్స్ కోసం బంపర్ ఆఫర్ ఇచ్చారు. కేవలం లవర్స్ కోసమే..

Naveen Chandra Swathi Reddy Month of Madhu movie special shows for lovers
Month of Madhu : నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి, శ్రేయ నవిలే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘మంత్ అఫ్ మధు’. గతంలో నవీన్ చంద్రతో ‘భానుమతి అండ్ రామకృష్ణ’ అనే సినిమాని తెరకెక్కించిన ‘శ్రీకాంత్ నాగోతి’ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ మూవీ ఆడియన్స్ నుంచి మంచి స్పందన అందుకుంది. అలాగే నవీన్ అండ్ స్వాతి కలిసి గతంలో ‘త్రిపుర’ అనే సినిమాలో నటించి సక్సెస్ పెయిర్ అనిపించుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాపై మంచి బజ్ నెలకుంది. ఈ వారం అక్టోబర్ 6న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.
ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో ఉన్న చిత్ర యూనిట్ తాజాగా ఒక కొత్త ఆఫర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తున్నారు. జనరల్ గా ఫ్యాన్స్ కి కొంచెం ముందుగానే సినిమాని ప్రీమియర్స్ వేయడం జరుగుతుంది. ఈ మూవీని కూడా ‘సిక్రెట్ స్క్రీనింగ్’ అంటూ అక్టోబర్ 5 సాయంత్రం హైదరాబాద్ అండ్ వైజాగ్ లో ప్రీమియర్స్ వేయబోతున్నారు. అయితే ఈ ప్రీమియర్స్ అందరి కోసం కాదట. కేవలం లవర్స్ కోసమే వేయబోతున్నారు. ఇక ఈ షో కోసం టికెట్స్ పొందడానికి ఒక గూగుల్ ఫార్మ్ ని రిలీజ్ చేశారు.
Also Read : Devara : ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. దేవర కూడా రెండు భాగాలుగా..? కొరటాల శివ అప్డేట్..!
ఆ ఫార్మ్ ని ఓపెన్ చేసి అందులో మీ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే చాలు. మీరు మీ లవర్ తో కలిసి ఆ సీక్రెట్ స్క్రీనింగ్ చూసేయొచ్చు. మరి ఈ సిక్రెట్ షో చూడడానికి మీరుకూడా వెళ్తారా..? ఒకవేళ వెల్దామనుకుంటే.. ఇప్పుడు గూగుల్ ఫార్మ్ ని ఫిల్ చేసేయండి. కాగా ఈ మూవీ లవ్ మ్యారేజ్ అండ్ డివోర్స్ చుట్టూ ఒక ఎమోషనల్ కంటెంట్ తో ఉండబోతుంది. ఇప్పటి జనరేషన్ లవ్ స్టోరీస్ ని బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
SECRET SCREENINGS of the “TRUEST LOVE STORY” #MonthOfMadhu – Watch it before the world does ❤️
Fill in the form now!
– https://t.co/rVNDm46A2YGrand Release Worldwide on 6th October?@Naveenc212 #Swathi @srikanthnagothi @shreya_navile @ravikanthperepu @harshachemudu pic.twitter.com/KTCXhtHcj5
— Krishiv Productions (@KrishivOfficial) October 4, 2023