Naveen polishetty : ఒకప్పుడు ఇక్కడే పాసులు లేక ఈవెంట్స్ లోపలికి రానివ్వలేదు.. ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా వచ్చా..

నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. ''కొన్నేళ్ల క్రితం ఇదే శిల్పకళావేదికలో ఎన్నో ఈవెంట్స్‌కి పాసులు దొరక్క గేటుదాకా వచ్చి బాధపడుతూ తిరిగి వెళ్లిపోయిన రోజులు..............

Naveen polishetty : ఒకప్పుడు ఇక్కడే పాసులు లేక ఈవెంట్స్ లోపలికి రానివ్వలేదు.. ఇప్పుడు చీఫ్ గెస్ట్ గా వచ్చా..

Naveen polishetty emotional speech at Swathimuthyam Movie Pre Release Event

Updated On : October 3, 2022 / 3:55 PM IST

Naveen polishetty :  నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు గణేష్‌ స్వాతిముత్యం సినిమాతో హీరోగా పరిచయం అవ్వబోతున్నాడు. వర్ష బొల్లమ్మ హీరోయిన్‌ గా నటిస్తుండగా కొత్త దర్శకుడు లక్ష్మణ్‌ కె.కృష్ణ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడి ఇప్పుడు దసరాకి అక్టోబర్ 5న రిలీజ్ కానుంది.

‘స్వాతిముత్యం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌ శిల్పకళావేదిక లో జరిగింది. ఈ ఈవెంట్ కి నవీన్‌ పొలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇద్దరికీ యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వీరిద్దరూ తమ సరదా స్పీచ్ లతో అందర్నీ నవ్వించారు. ఇక నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ స్వాతిముత్యం సినిమా గురించి, హీరో గణేష్, హీరోయిన్ వర్ష, నిర్మాత నాగవంశీ గురించి మాట్లాడారు. అలాగే ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకొని ఎమోషనల్ అయ్యాడు.

Prabhas : ఆదిపురుష్ సినిమా ఒప్పుకోవడానికి మూడు రోజులు ఆలోచించాను.. రాముడే ఈ సినిమా చేయించాడు..

నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ.. ”కొన్నేళ్ల క్రితం ఇదే శిల్పకళావేదికలో ఎన్నో ఈవెంట్స్‌కి పాసులు దొరక్క గేటుదాకా వచ్చి బాధపడుతూ తిరిగి వెళ్లిపోయిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఇదే వేదికపైకి చీఫ్ గెస్ట్ గా వచ్చాను. ఆరోజు నిరాశతో తిరిగివెళ్లిపోయిన నన్ను ఈరోజు ఇదే వేదికపై అతిథిగా నిలబెట్టిన తెలుగు ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. జాతిరత్నాలు తర్వాత చాలా రోజుల తర్వాత మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినీ పరిశ్రమలో పనిచేయడం ఒక వరం. కరోనా సమయంలో అన్ని సినీ పరిశ్రమలు ఇబ్బందుల్లో ఉండి, థియేటర్ల పరిస్థితి ఏంటో అని అందరూ ఆలోచించారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం రిలీజైన ప్రతి సినిమాని హిట్ చేసి మా మీద ప్రేమాభిమానాలు చూపించారు” అని తెలిపాడు.