Nayanthara : నయన్ దంపతులు చేసిన పనికి.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజెన్లు!

లేడీ మెగాస్టార్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ క్రిందటి ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత నాలుగు నెలలకే వీరిద్దరూ సరోగసీ ద్వారా ఇద్దరి కవల పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు. కాగా ప్రస్తుతం ఈ జంట చేసిన ఒక పని అందరి మనసులను దోచుకుంటుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో, అది చూసిన నెటిజెన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు.

Nayanthara : నయన్ దంపతులు చేసిన పనికి.. హ్యాట్సాఫ్ అంటున్న నెటిజెన్లు!

Nayanthara and Vignesh Shivan celebrating new year in different way

Updated On : January 4, 2023 / 4:00 PM IST

Nayanthara : లేడీ మెగాస్టార్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ క్రిందటి ఏడాది జూన్‌లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత నాలుగు నెలలకే వీరిద్దరూ సరోగసీ ద్వారా ఇద్దరి కవల పిల్లలకి తల్లిదండ్రులు అయ్యారు. కాగా ప్రస్తుతం ఈ జంట చేసిన ఒక పని అందరి మనసులను దోచుకుంటుంది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో, అది చూసిన నెటిజెన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు.

Nayanthara : ప్రభాస్ కంటే బాలయ్య పెద్ద ఆకతాయి అంటున్న నయనతార..

సాధారణంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే పార్టీలు చేసుకోవడమో లేదా పూజలు నిర్వహించడమో చేస్తారు చాలా మంది. కానీ ఈ సౌత్ స్టార్ కపుల్ తమ న్యూ ఇయర్ వేడుకలను వాటికీ బిన్నంగా జరుపుకున్నారు. న్యూ ఇయర్ రోజున నయన్ అండ్ విగ్నేష్.. రోడ్ పక్కన ఉన్న పేద పిల్లలకు, ఆడవాళ్లకు బహుమతులు ఇచ్చి వారిని ఆనందపరుస్తూ, వీళ్ళు సంతోష పడ్డారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో చూసిన కొందరు నెటిజెన్లు హ్యాట్సాఫ్ అంటున్నా, మరికొందరు మాత్రం.. మంచి చేశారు కానీ ఇలా వీడియో తీసుకోని పబ్లిసిటీ చేసుకోవడం అవసరమా? అని క్యూస్షన్ చేస్తున్నారు.

కాగా నయనతార ఇటీవల కనెక్ట్ అనే హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ ‘జవాన్’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాని తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్నాడు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్న ఈ మూవీలో తమిళ హీరో విజయ్, అజయ్ దేవగన్, దీపికా పడుకోణె అతిధి పాత్రలో కనిపించబోతున్నారు.