Suriya 43 : సూర్య, సుధా కొంగర సినిమాలో నజ్రియా నజీమ్..?

సూర్య, సుధా కొంగర కలయికలో తెరకెక్కబోయే సినిమాలో నజ్రియా నజీమ్ నటించనుందట. ఆల్రెడీ..

Suriya 43 : సూర్య, సుధా కొంగర సినిమాలో నజ్రియా నజీమ్..?

Nazriya Nazim plays important role in Suriya 43

Updated On : September 15, 2023 / 9:04 AM IST

Suriya 43 : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘కంగువ’ (Kanguva) మూవీలో నటిస్తున్నాడు. ఈ మూవీ తరువాత సుధా కొంగర దర్శకత్వంలో నటించబోతున్నాడు. గతంలో వీరిరుద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా ఎంతటి విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పలు నేషనల్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఆ మూవీకి సంగీతం అందించిన జి వి ప్రకాష్.. ఈ ప్రాజెక్ట్ కి కూడా మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. ఇక ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ఒక ముఖ్యపాత్రలో కనిపించబోతున్నాడని ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి.

Sai Pallavi : ఆ స్టార్ హీరో వారసుడి మూవీతో సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ..

తాజాగా ఇప్పుడు మరో మలయాళ స్టార్ పేరు కూడా వినిపిస్తుంది. ఒకప్పుడు తమిళంలో సూపర్ హిట్ సినిమాలు చేసిన నజ్రియా నజీమ్ ఫహద్.. సూర్య మూవీతో మళ్ళీ కమ్‌బ్యాక్ ఇవ్వడానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. నజ్రియా ఆల్మోస్ట్ లాక్ చేసేశారని కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న వార్త. మరి ఈ వార్త ఎంతవరకు నిజమో కాదో చూడాలి. కాగా పెళ్లి తరువాత సినిమాల్లో తక్కువ కనిపిస్తున్న నజ్రియా నజీమ్ ఫహద్.. ఇటీవల తెలుగులో నాని సరసన ‘అంటే సుందరానికి’ సినిమాలో నటించింది.

Mark Antony Twitter Review : విశాల్ ‘మార్క్ ఆంటోని’ ట్విట్టర్ రివ్యూ..

ఇక సూర్య కంగువ విషయానికి వస్తే.. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శివ డైరెక్ట్ చేస్తున్నాడు. దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈ సినిమా రెండు టైం పీరియడ్స్ లో కనిపించనుందట. ఒక పీరియడ్ లో సూర్య వారియర్ గా కనిపించనున్నాడు. మరొకటి ప్రస్తుతం కాలానికి చెందిన టైం పీరియడ్. KE జ్ఞానవేల్ రాజా, UV క్రియేషన్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రంతో బాహుబలి, కేజీఎఫ్ చిత్రాలకు సమాధానం చెబుతాం అంటూ నిర్మాతలు చెబుతున్నారు.