రూలర్ ట్రైలర్: ఫైర్‌కే ఫోన్.. వెంటాడి, వేటాడి, నటసింహం గర్జన

  • Published By: vamsi ,Published On : December 8, 2019 / 03:14 AM IST
రూలర్ ట్రైలర్: ఫైర్‌కే ఫోన్.. వెంటాడి, వేటాడి, నటసింహం గర్జన

Updated On : December 8, 2019 / 3:14 AM IST

నందమూరి బాలకృష్ణ.. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘రూలర్‌’. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ పోస్టర్స్, టీజర్‌ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. లేటెస్ట్‌గా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. డిసెంబర్‌ 8, 2019, ఉదయం 8గంటల 19 నిమిషాలకు ట్రైలర్‌ని విడుదల చేసింది నిర్మాణ సంస్థ. బాలయ్య ఇందులో విభిన్నమైన రెండు పాత్రల్లో కనిపించారు.

‘ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే.. దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు.. పొగరు ఉంటుందో చూపించమంటవా’ అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్‌ హైలెట్‌గా నిలిచింది. వెంటాడి, వేటాడి అంటూ నటిసింహం బాలయ్య చెప్పిన డైలాగ్ ట్రైలర్లో ఉండగా.. అభిమానులు ఆశించే మాస్ ఎలివేషన్స్ ట్రైలర్‌లో పుష్కలంగా కనిపిస్తున్నాయి. 

హ్యాపీ మూవీస్‌ పతాకంపై నిర్మిస్తున్న సినిమాకి సి.కల్యాణ్‌ నిర్మాతగా వ్యవరిస్తున్నారు. ఇంకా చిత్రంలో కథానాయికలుగా సోనాల్‌ చౌహాన్, వేదికలు నటిస్తుండగా, ప్రకాష్‌ రాజ్, జయసుధ, భూమిక చావ్లాలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20వ తేదీన విడుదల కానుంది.