Neha Shetty : నేహా శెట్టి ఫ్యామిలీ చూశారా? ఫ్యామిలీతో పుట్టిన రోజు సెలబ్రేషన్స్..
ఇటీవల డిసెంబర్ 5న నేహా శెట్టి పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా నేహా తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫోటోలని షేర్ చేసింది.

Neha Shetty Celebrated her Birthday with Family and Shares Photos
Neha Shetty : 2016లోనే ఓ కన్నడ సినిమాతో సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన నేహశెట్టి 2018లో ఆకాష్ పూరి హీరోగా చేసినా మెహబూబా సినిమాతో తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాతో అంతగా గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఓ రెండు సినిమాలు చేసినా రాని గుర్తింపు గత సంవత్సరం DJ టిల్లు సినిమాతో ఒక్కసారిగా వచ్చింది. డీజే టిల్లు సినిమాతో నేహశెట్టి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
ఆ సినిమాలో రాధికా క్యారెక్టర్ తో ప్రేక్షకులని మెప్పించింది. ఆ క్యారెక్టర్ బాగా పాపులర్ అయింది. ఆ సినిమా తర్వాత వెంటనే బెదురులంక, రూల్స్ రంజన్ సినిమాలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ కన్నడ భామ తెలుగులో బాగా పాపులారిటీ, అభిమానులు సంపాదించుకొని ఛాన్సులు కూడా దక్కించుకుంటుంది. ఇటీవల డిసెంబర్ 5న నేహా శెట్టి పుట్టిన రోజు కావడంతో అభిమానులు, నెటిజన్లు, పలువురు ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
Also Read : Vasanthi Krishnan : పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్‌బాస్ భామ.. ప్రియుడితో నిశ్చితార్థం..
తాజాగా నేహా తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ఫోటోలని షేర్ చేసింది. నేహా శెట్టి తన ఫ్యామిలీతో ఇంట్లోనే పుట్టిన రోజు సెలబ్రేషన్స్ చేసుకుంది. తన తండ్రి, తల్లి, చెల్లిలతో సెలబ్రేట్ చేసుకొని ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. నేహా శెట్టి ఫ్యామిలీ ఫోటో వైరల్ గా మారింది. నేహా తండ్రి వ్యాపారవేత్త కాగా, తల్లి డెంటిస్ట్, చెల్లి చదువుకుంటుంది. ఇక నేహా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫోటోషూట్స్ తో అలరిస్తుంది. త్వరలో నేహా శెట్టి.. విశ్వక్ సేన్ సరసన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో రాబోతుంది.