Alia Bhatt: ఆలియాను ఇలా వాడేస్తారా అంటూ పాక్ రెస్టారెంట్‌పై నెటిజెన్స్ ఆగ్రహం!

బాలీవుడ్ నటి ఆలియా భట్, ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అయ్యింది. ఈ బ్యూటీ నటించిన రీసెంట్ మూవీ ‘గంగూబాయి కతియావాడి’.....

Alia Bhatt: ఆలియాను ఇలా వాడేస్తారా అంటూ పాక్ రెస్టారెంట్‌పై నెటిజెన్స్ ఆగ్రహం!

Netizens Fire On Pakistan Restaurant For Using Aliya Bhatt Scene

Updated On : June 20, 2022 / 6:54 PM IST

Alia Bhatt: బాలీవుడ్ నటి ఆలియా భట్, ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం అయ్యింది. ఈ బ్యూటీ నటించిన రీసెంట్ మూవీ ‘గంగూబాయి కతియావాడి’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో ఆలియా పర్ఫార్మెన్స్‌కు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఇక ఈ సినిమాలో ఆలియా ఓ వేశ్య పాత్రలో నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఆలియా ఈ సినిమాలో చేసిన పాత్రను పాకిస్థాన్‌కు చెందిన ఓ రెస్టారెంట్ తమ బిజినెస్ కోసం వాడుకొని నెటిజన్ల ఆగ్రహానికి గురవుతోంది.

Alia Bhatt : నిర్మాతగా మారిన అలియాభట్.. షారుక్‌తో కలిసి సినిమా నిర్మాణం..

పాకిస్థాన్‌లోని స్వింగ్ అనే రెస్టారెంట్ నిర్వాహకులు తమ బిజినెస్ ప్రచారంలో భాగంగా గంగూబాయి కతియావాడి సినిమాలోని ఓ సీన్‌ను తమ ఇష్టానికి వాడేశారు. ఈ సినిమాలో గంగూబాయి అనే వేశ్య పాత్రలో ఆలియా ఓ బిల్డింగ్ బయట నిలబడి రోడ్డుపై వచ్చివెళ్లే వారిని రమ్మంటూ పిలుస్తుంది. ఇప్పుడు ఇదే సీన్‌ను తమ బిజినెస్ కోసం వాడేశారు పాకిస్థాన్‌కు చెందిన స్వింగ్ రెస్టారెంట్. సోమవారం నాడు తమ రెస్టారెంట్‌లో మగవారికి అదిరిపోయే ఆఫర్లు ఉన్నాయని.. అందుకే వారిని రమ్మనే విధంగా ఆలియా భట్ సీన్‌ను వాడేసింది సదరు రెస్టారెంట్.

Alia Bhatt: అలియా హాలీవుడ్ ఎంట్రీ.. అక్కడా గెలుస్తుందా?

దీంతో ఆ కంపెనీపై నెటిజన్లు, ఆలియా భట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమ బిజినెస్ పెంచుకునేందుకు ఎలాంటి పనులైనా చేస్తారా అంటూ ఆ రెస్టారెంట్ నిర్వాహకులను తిట్టిపోస్తున్నారు. ఏదేమైనా ఆలియా భట్ సీన్‌ను ఇలా వాడి నెటిజన్ల ఆగ్రహానికి గురైన స్వింగ్ రెస్టారెంట్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆలియా ఫ్యాన్స్ కోరుతున్నారు. మరి ఈ వివాదంపై సదరు రెస్టారెంట్ నిర్వాహకులు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Swing ? (@swing.khi)