Sai Pallavi: సాయి పల్లవిపై నెటిజన్స్ ప్రశంసల వర్షం

యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవి జంటగా నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘విరాటపర్వం’ నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల....

Sai Pallavi: సాయి పల్లవిపై నెటిజన్స్ ప్రశంసల వర్షం

Netizens Praises Sai Pallavi Performance In Virata Parvam

Updated On : June 17, 2022 / 7:53 PM IST

Sai Pallavi: యంగ్ హీరో రానా దగ్గుబాటి, అందాల భామ సాయి పల్లవి జంటగా నటించిన ప్రెస్టీజియస్ మూవీ ‘విరాటపర్వం’ నేడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాకు మంచి టాక్ ను అందిస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు.

Sai Pallavi : సినిమాలకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆ పని చేస్తాను..

అయితే ఈ సినిమాను చూసిన ఆడియెన్స్ హీరోయిన్ సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కు మంత్రముగ్ధులవుతున్నట్లుగా తెలుస్తోంది. ఏ థియేటర్ దగ్గర చూసినా, ప్రేక్షకులు సాయి పల్లవి పర్ఫార్మెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఎమోషన్ సీన్స్ లో సాయి పల్లవి యాక్టింగ్ కు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అంతేగాక వెన్నెల పాత్రలోని ప్రేమను తన కళ్ళతో పలికించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక ఈ సినిమాలో వెన్నెల పాత్రలో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకులు పట్టం కడుతుండటంతో ఈ సినిమా ఎలాంటి ఘన విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Sai Pallavi: సాయి పల్లవిపై పోలీసు కేసు.. ఏం చేసిందంటే?

కాగా.. ఈ సినిమాలో రానా దగ్గుబాటి నక్సల్ పాత్రలో నటించగా, ప్రియమణి, నవీన్ చంద్ర, నందితా దాస్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి డైరెక్ట్ చేయగా, సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ సినిమాలో సాయి పల్లవి పర్ఫార్మెన్స్ కు అవార్డులు ఖాయమని ఆమె అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.