Radha Manoharam : ‘రాధా మనోహరం’.. మరో కొత్త సీరియల్.. తల్లీకూతుళ్లు, భార్యాభర్తల అనుబంధంతో..
తల్లీకూతుళ్లు, భార్యా భర్తల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా రాధా మనోహరం సీరియల్ ఉండనుంది.

New Emotional Serial Radha Manoharam Telecasting Full Details Here
Radha Manoharam : ఇటీవల కొత్త కొత్త సీరియల్స్, టీవీ షోలతో అన్ని ఛానల్స్ పలకరిస్తున్నాయి. టాప్ ఛానల్స్ లో ఒకటైన ఈటీవీలో రెగ్యులర్ గా కొత్త సీరియల్స్, షోస్ ఎన్నో వచ్చి ప్రేక్షకాదరణ తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈటీవీలో మరో కొత్త సీరియల్ మొదలైంది. రాధా మనోహరం అనే కొత్త సీరియల్ ఈటీవీలో మొదలైంది. తల్లీకూతుళ్లు, భార్యా భర్తల మధ్య జరిగే ఎమోషనల్ డ్రామాగా ఈ సీరియల్ ఉండనుంది.
Also Read : Samantha : సమంత బర్త్ డే ఏ దేశంలో చేసుకుందో తెలుసా? బర్త్ డే ట్రిప్ ఫోటోలు షేర్ చేసిన సామ్..
శతమానంభవతి, ముత్యమంత ముద్దు,అగ్ని పరీక్ష, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. లాంటి పలు సీరియల్స్‌తో మెప్పించిన సిద్ధార్థ వర్మ ఇప్పుడు రాధా మనోహరం సీరియల్ తో మల్లి బుల్లితెర ప్రేక్షకులని మెప్పించడానికి వచ్చారు. ఇక ఈ సీరియల్ లో ఫిమేల్ లీడ్ గా కన్నడ సీరియల్స్ పాపులర్ నటి శాలోమీ డిసౌజా నటిస్తోంది. తల్లి ప్రేమ తెలియని అమ్మాయి, కూతుర్ని పోగొట్టుకున్న అమ్మ, భార్యభర్తల మధ్య సంఘర్షణ.. లాంటి కథాంశంతో ఎమోషనల్ డ్రామాగా రాధా మనోహరం సీరియల్ రానుంది.
ఏప్రిల్ 29న ఈ రాధా మనోహరం సీరియల్ టెలికాస్టింగ్ మొదలైంది. ఈటీవీలో సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం గం.2:30 నిమిషాలకు ప్రసారం అవుతుంది. ఈ సీరియల్ ప్రోమోలు ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్నాయి.