సైరాను కాపాడేది నిహారికే.. కీలక పాత్రలో!

  • Published By: vamsi ,Published On : February 26, 2019 / 07:01 AM IST
సైరాను కాపాడేది నిహారికే.. కీలక పాత్రలో!

Updated On : February 26, 2019 / 7:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఒక్క సీన్ లో అయినా నటించాలని మెగా కుటుంబంలో ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. మెగా కుటుంబంలోని హీరోలు అందరూ ఏదో ఒక సినిమాలో చిన్న సన్నివేశంలో కనబడగా.. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఇప్పుడు అటువంటి అవకాశం కొట్టేసింది. చిరంజీవి హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సైరా సినిమాలో పెదనాన చిరంజీవితో కలిసి స్క్రీన్ పంచుకునే అవకాశం నిహారికకు దక్కింది. ‘సైరా’లో నిహారిక ఓ కీల‌క పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. క‌నిపించేది కాసేపే అయినా పాత్ర‌కు చాలా ప్రాధాన్యం ఉంద‌ని, ఈ పాత్ర సినిమాలో సైరాను కాపాడే పాత్ర అని చెబుతున్నారు.

స్వాతంత్ర సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా.. సినిమాలో నిహారిక గిరిజ‌న యువ‌తిగా క‌నిపించ‌బోతోంద‌ట‌. బ్రిటీష్ సైన్యంపై సైరా నరసింహారెడ్డి గొరెల్లా యుద్ధ ప‌ద్ధ‌తిలో దాడి చేస్తున్నప్పుడు.. సైరాని బంధించ‌డానికి బ్రిటీష్ ప్ర‌భుత్వం పెద్ద ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దింపుతుంది. ఓ సంద‌ర్భంలో గిరిజ‌న తాండా ద్వారా సైరా త‌ప్పించుకోవాల‌ని చూడగా బ్రిటీష్ సైన్యం అష్ట‌దిగ్బంధ‌నం చేస్తుంది. అప్పుడే నిహారిక ‘సైరా’ని కాపాడుతుంది. ఈ సినిమాలో నిహారిక క‌నిపించేది ఈ ఒక్క స‌న్నివేశంలోనే. అయితే ఈ సీన్ చాలా బాగా వ‌చ్చింద‌ని చిత్రవర్గాలు చెబుతున్నాయి. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ద‌స‌రాకి విడుద‌ల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.