ROBINHOOD Glimpse : నితిన్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.. ‘రాబిన్ హుడ్’ గ్లింప్స్ రిలీజ్..

నితిన్ బర్త్ డే సందర్భంగా 'రాబిన్ హుడ్' మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసారు.

ROBINHOOD Glimpse : నితిన్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది.. ‘రాబిన్ హుడ్’ గ్లింప్స్ రిలీజ్..

Nithiin Venky Kudmula ROBINHOOD movie Glimpse released

ROBINHOOD Glimpse : భీష్మ సినిమా తర్వాత వెంకీ కుడుముల డైరెక్షన్‌లో నితిన్ చేస్తున్న మరో మూవీ ‘రాబిన్ హుడ్’. హీస్ట్ నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమా నుంచి గతంలో టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ఆడియన్స్ ముందుకు వచ్చి ఆకట్టుకుంది. ఇక నేడు నితిన్ పుట్టినరోజు కావడంతో.. మేకర్స్ గ్లింప్స్ ని రిలీజ్ చేసారు.

అయితే ఈ గ్లింప్స్ లో మూవీకి సంబంధించిన షూటింగ్ సీన్స్ ని ఏం చూపించలేదు. కేవలం నితిన్ వాకింగ్ వీడియో షాట్ ఒకటే చూపించారు. మిగిలినది అంతా కాన్సెప్ట్ డిజైన్ వీడియోనే చూపించారు. ఈ కాన్సెప్ట్ డిజైన్ లో సిటీకి సంబంధించిన షాట్స్, అడివికి సంబంధించిన షాట్స్ ని చూపించారు.

Also read : Game Changer : రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ చెప్పిన దిల్ రాజు.. అలాగే రిలీజ్ డేట్ గురించి..

మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా రష్మికని ఎంపిక చేసుకున్నారు. అయితే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం హీరోయిన్ గా ఎవరు చేస్తున్నారు అనేది సస్పెన్స్ గా ఉంది. ఇక ఈ మూవీ భీష్మ లాగానే ఎంటర్టైనర్ గా ఉంటుందని మేకర్స్ పేర్కొంటున్నారు.

ఇక ఈ బర్త్ డే సందర్భంగా నితిన్ నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమా నుంచి కూడా అప్డేట్ వచ్చింది. వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సిస్టర్ సెంటిమెంట్ తో రాబోతుందట.