Nithya Menen: “వండర్ ఉమెన్”గా నిత్యమీనన్..
టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అందర్నీ కొంతసమయం పాటు షాక్ కి గురి చేసింది. తాను ప్రెగ్నెంట్ అయినట్లు చెబుతూ సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫోటోని అప్లోడ్ చేసింది. అయితే అది మలయాళ దర్శకురాలు అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

Nithya Menen Wonder Women Trailer Release
Nithya Menen: టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్యామీనన్ ఇటీవల సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అందర్నీ కొంతసమయం పాటు షాక్ కి గురి చేసింది. తాను ప్రెగ్నెంట్ అయినట్లు చెబుతూ సోషల్ మీడియాలో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఫోటోని అప్లోడ్ చేసింది. అయితే అదే ఫోటోను మలయాళ నటి పార్వతి కూడా కొద్దిసేపటికి షేర్ చేయడంతో ఇది ఏదో సినిమా ప్రమోషన్ కోసమని అర్ధమైంది.
కర్లీ హెయిర్‌తో మెప్పిస్తున్న కథానాయికలు
మలయాళ దర్శకురాలు అంజలి మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పేరెంట్ హుడ్ మూవీ “వండర్ ఉమెన్”. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను నేడు విడుదల చేసింది మూవీ టీం. కథ విషయానికి వస్తే.. గర్భం దాల్చిన స్త్రీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పుట్టిన పిల్లల పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలు చుట్టూ సినిమా కథాంశం తిరగనుంది.
సీనియర్ యాక్టర్ నదియా.. పేరెంటల్ హుడ్ క్లాసులు నిర్వహిస్తూ ఉంటుంది. వేరు వేరు ఆలోచనలు, కుటుంబాలు కలిగిన ఆరుగురు గర్భిణీ స్త్రీల కథల చుట్టూ సినిమా మొత్తం తిరగనుంది. ఈ సినిమాలో గర్భిణిగా పార్వతి తిరువోతు, నిత్యా మీనన్, మరియు అమృతా సుభాష్‌లు కనిపించబోతున్నారు. నవంబర్ 18 నుండి సోనీలివ్ లో ఈ సినిమా ప్రసారం కాబోతుంది.