Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9లో 5వ వారం నామినేషన్స్.. ఒక్కొక్కరిని ఈడ్చిపడేశారు.. చివరికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన రాము
బిగ్ బాస్ సీజన్ 9 షో ఎంత రసవత్తరంగా ముందుకు సాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు(Bigg Boss 9 Telugu). అంతేకాదు, ఈసారి నాగార్జున హోస్టింగ్ కూడా అదరగొడుతున్నారు.

Nominations for the 5th week of Bigg Boss Season 9 have begun.
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 షో ఎంత రసవత్తరంగా ముందుకు సాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు, ఈసారి నాగార్జున హోస్టింగ్ కూడా అదరగొడుతున్నారు. వీక్ డేస్ లో ఎపిసోడ్స్ కంటే వీక్ ఎండ్ లో నాగార్జున ఎపిసోడ్స్ కోసమే ఆడియన్స్ ఎక్కువగా ఎదురుచూస్తున్నారు. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే.. మొదటి ఎపిసోడ్ నుండే గొడవలతో రెచ్చిపోగా రోజురోజుకి ఆ గొడవలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పటికే హౌస్ నుంచి శ్రష్టి వర్మ, ప్రియా, మనీష్, హరిత హరీష్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. సోమవారం 5వ వారానికి సంబందించిన నామినేషన్స్ మొదలయ్యాయి.
అయితే, ఈ వారం నామినేషన్స్ ప్రక్రియను కాస్త కొత్తగా మొదలుపెట్టాడు బిగ్ బాస్. ఫ్లోరా, రాము రాథోడ్ ని తప్పించి మిగతా వారందనీ డైరెక్ట్ బిగ్ బాసే నామినేట్ చేశాడు. తరువాత ఒక పెద్ద బెడ్ ని గార్డెన్ లో ఏర్పాటు చేసి నామినేట్ ఐనవారందనీ బెడ్ పైకి ఎక్కమని ఆదేశించాడు. ఇప్పుడు మీలో చివరకు ఈ బెడ్ పై ఎవరైతే ఉంటారో వారు నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారు అని చెప్పాడు. దాంతో, కంటెస్టెంట్స్ అంతా ఒకరిని ఒకరు బయటకు నెట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ ప్రక్రియ ముగిసేసరికి రాము రాథోడ్, శ్రీజ, ఇమ్మానుయేల్, పవన్ కళ్యాణ్ తప్ప మిగిలిన అందరూ నామినేషన్స్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఇక నామినేషన్స్ పూర్తేయ్యే సమయానికి భరణి కూడా నామినేషన్స్ లో ఉన్నాడు. కానీ, కెప్టెన్ రాముకి ప్రత్యేకమైన పవర్ ఇచ్చి ఒకరిని సేవ్ చేయాలని చెప్పాడు బిగ్ బాస్. అప్పుడు రాము రాథోడ్ భరణిని నామినేషన్స్ నుంచి సేవ్ చేసి తనూజ ని నామినేషన్స్ లో పంపినట్టు సమాచారం. ఈ విషయం లో తనూజకి రాముకి పెద్ద వాదనే జరిగింది. మరి ఈవారం ఇంటినుంచి ఎవరు బయటకు వెళతారు అనేది చూడాలి. డేంజర్ జోన్ లో మాత్రం రీతూ, దివ్య ఉన్నట్టుగా తెలుస్తోంది.